ఎమోషనల్ అయిన నటి ఇంద్రజ.. నాన్ననే ఇంట్లో వంట చేస్తారంటూ..?

తెలుగు, మలయాళ సినిమాలలో ఎక్కువగా నటించి పాపులారిటీని సంపాదించుకున్న ఇంద్రజ ఈ మధ్య కాలంలో బుల్లితెర షోలలో ఎక్కువగా సందడి చేస్తున్నారు.సుధీర్ ఇంద్రజ షోలోకి రాగ సుధీర్ అందం హిందోళం పాటకు తనదైన స్టైల్ లో స్టెప్పులు వేసి మెప్పించారు.

 Actress Indraja Goes Emotional In  Star Maa Sixth Sense Show , Emotional In Asho-TeluguStop.com

యాంకర్ ఓంకార్ ఇంద్రజను ఇంద్రలోకంలో ఇంద్రజతో పోల్చానని ఆవిడ ఎలా ఉంటారో తనకు తెలీదు అని ఈ ఇంద్రజను చూసిన తర్వాత తాను ఫిక్స్ అయ్యానని ఓంకార్ చెప్పుకొచ్చారు.

పైన ఉండే ఇంద్రజ కూడా భూమిపై ఉండే ఇంద్రజలానే ఉంటుందని తనకు అనిపిస్తోందని ఓంకార్ కామెంట్లు చేశారు.

ఆ మాట నమ్మినప్పుడు ఈ మాట కూడా నమ్మాలని ఓంకార్ చెప్పగా మీ కళ్లలో నాకు ఎందుకో అది కనిపించట్లేదని ఆమె అన్నారు.సుధీర్ కు బ్యాక్ గ్రౌండ్ లో కసికసికసి అనే పాట ప్లే కాగా సుధీర్ మిమ్మల్ని నమ్ముకుంటే నేను కాశీనే అని పంచ్ వేశారు.

ఆ తర్వాత సుధీర్, ఇంద్రజ కన్నెపెట్టరో పాటకు అదిరిపోయేలా స్టెప్పులు వేశారు.

ఓంకార్ నాన్న అంటే చాలా ఇష్టం కదా అని అడగగా తనకు చాలాచాలచాలా ఇష్టమని ఆమె అన్నారు.తనకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారే వంట చేస్తారని ఆమె అన్నారు.మా అమ్మకు మెడిసిన్స్ అందివ్వడం, అమ్మ బాగోగులు చూసుకోవడం, మా బాగోగులు చూసుకోవడం చేశారని ఇంద్రజ వెల్లడించారు.

తనకు తల్లి, తండ్రి అన్నీ నాన్నేనని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

తండ్రి ప్రేమను మనం ఎక్కువగా గుర్తించమని అయితే తండ్రి లేకపోతే కుటుంబం అనే బంధం ఉండదని ఆమె అన్నారు.ప్రతి ఒక్క నాన్నకు తలవంచి నమస్కరిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఈ ప్రోమోకు 4 లక్షల వ్యూస్ వచ్చాయి.

సుడిగాలి సుధీర్ ఎంట్రీతో ఈ వారం షోకు రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube