ఎమోషనల్ అయిన నటి ఇంద్రజ.. ఇది పచ్చి నిజమంటూ..?

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ఈ బుల్లితెర కామెడీ షోకు ప్రేక్షకుల ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు.

 Actress Indraja Emotional In Extra Jabardasth Show-TeluguStop.com

చాలామంది కమెడియన్లు ఈ షో వల్ల తాము ఆర్థికంగా స్థిరపడ్డామని వెల్లడించారు.ఈ షో లేకపోతే తమకు అస్సలు గుర్తింపు వచ్చేది కాదంటూ చాలామంది కమెడియన్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఈ షోపై కొంతమంది ప్రేక్షకులు విమర్శలు చేసినప్పటికీ ఎక్కువమంది మాత్రం ఈ షో ద్వారా కడుపుబ్బా నవుతున్నామని చెబుతున్నారు. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ షోలో బండ్ల గణేష్ ను ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు.2013 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అద్భుతం జరిగిందని ఆ అద్భుతమే జబర్దస్త్ అని రాకేష్ చెప్పుకొచ్చారు.జడ్జి మనో మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది జబర్దస్త్ షో వల్ల రిలాక్స్ అవుతున్నారని చెప్పుకొచ్చారు.

 Actress Indraja Emotional In Extra Jabardasth Show-ఎమోషనల్ అయిన నటి ఇంద్రజ.. ఇది పచ్చి నిజమంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హైపర్ ఆది మాట్లాడుతూ జబర్దస్త్ లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్లు ఎవ్వరూ లేరని వెల్లడించారు.సుధీర్ మాట్లాడుతూ తమతో పాటు తమ కుటుంబాలు సంతోషంగా ఉండటానికి జబర్దస్త్ కారణమని పేర్కొన్నారు.ఎక్కడో ఫ్లాట్ ఫామ్ లో ఉన్నవాళ్లను జబర్దస్త్ షో ఈ స్థాయికి తెచ్చిందని గెటప్ శ్రీను అన్నారు.ఆ తరువాత ఇంద్రజ జబర్దస్త్ షో గురించి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 27 సంవత్సరాలు అయిందని చెప్పారు.

నన్ను అభిమానించే వాళ్లు ఎంతమంది ఉన్నారో నాకు జబర్దస్త్ షో ద్వారానే తెలుస్తోందని అన్నారు.ఇది పచ్చినిజమని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

రోజా సర్జరీ చేయించుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉండటంతో అమెకు బదులుగా ఇంద్రజ జడ్జిగా హాజరవుతున్నారు.ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పేరును తెచ్చిపెట్టే సినిమాలలో నటిస్తూ ఉండటం గమనార్హం.

#EmotionalIn #Roja #Actress Indraja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు