రాహుల్‌ ఎలిమినేట్‌, కాదు కాదు హిమజ ఔట్‌  

Actress Himaja To Get Evicted From Bigg Boss Telugu 3 Rahul-actress Himaja,bigg Boss 3 Eighth Elimination,mahesh And Rahul

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నుండి ఈ వారం ఎలిమినేషన్‌ పక్రియ కాస్త విభిన్నంగా సాగింది.మొదట ఎలిమినేషన్స్‌కు నామినేషన్‌ విషయంలో అంతా కూడా అవాక్కయ్యేలా త్యాగాల ఆధారంగా నామినేట్‌ చేయడం జరిగింది.

Actress Himaja To Get Evicted From Bigg Boss Telugu 3 Rahul-Actress Bigg Eighth Elimination Mahesh And Rahul

మహేష్‌ విట్టా, రాహుల్‌లు వారికి సంబంధించిన వారు త్యాగం చేయక పోవడం వల్ల ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు.ఇక కెప్టెన్‌గా పవర్స్‌ను ఉపయోగించి హిమజను కెప్టెన్‌ వితిక నామినేట్‌ చేయడం జరిగింది.

మొత్తంగా ముగ్గురు మాత్రమే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు.

Actress Himaja To Get Evicted From Bigg Boss Telugu 3 Rahul-Actress Bigg Eighth Elimination Mahesh And Rahul

ఈ ముగ్గురిలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అంటూ అంతా అనుకుంటున్న సమయంలో నిన్నటి ఎపిసోడ్‌లో రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు.

కన్నీరు పెట్టుకుని అంతా బాధతో రాహుల్‌ను బయటకు పంపించారు.కాని రాహుల్‌ బయటకు వచ్చిన తర్వాత నాగార్జున అనూహ్యంగా రాహుల్‌ ఇది కేవలం ఫేక్‌ ఎలిమినేషన్‌ పక్రియ.

నువ్వు ఎలిమినేట్‌ అవ్వలేదు.నువ్వు మళ్లీ హౌస్‌లోకి వెళ్తావు అంటూ ప్రకటించాడు.నాగార్జున ప్రకటనకు రాహుల్‌ మతి పోయినంత పనైంది.మళ్లీ ఇంట్లోకి అనగానే ఆనందంతో ఎగిరి గంతేసినంత పని చేశాడు.

సోమవారం ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాల మద్య రాహుల్‌ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు.ఇక మరి ఈ వారం ఎలిమినేషన్‌ పక్రియ పరిస్థితి ఏంటంటే రాహుల్‌ ఎలాగూ సేఫ్‌ అయ్యాడు.

కాబట్టి ఉండేది మహేష్‌ మరియు హిమజలు మాత్రమే.వీరిద్దరిలో హిమజ బయటకు వచ్చేసిందని ఇప్పటికే లీక్‌ వచ్చేసింది.

నేడు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్‌ను నిన్ననే చిత్రీకరించారు.అందుకే హిమజ ఎలిమినేషన్‌ కన్ఫర్మ్‌ అంటున్నారు.

.

తాజా వార్తలు