నటి హిమజ కు ఎన్ని కోట్ల ఆస్థి ఉందో తెలుసా!

బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ హిమజ. అప్పటికే పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.

 Bigg Boss Contestant Actress Himaja Properties And Details, Himaja, Bigg Boss, B-TeluguStop.com

బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత బాగా పాపులారటీ సంపాదించింది.అయితే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఘాటుగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ.

తన గురించి ఎవరెవరో పిచ్చి కామెంట్లు చేస్తే స్పందించాల్సిన అవసరం లేదని చెప్పింది.తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆమె గురించి సోషల్ మీడియాలో పలు ఆసక్తికర చర్చలు జరిగాయి.

కేవలం సీరియల్ ఆర్టిస్టుగా ఉంటూ ఖరీదైన ఫ్లాట్లు, లగ్జరీ కార్లు ఎలా కొనుగోలు చేసింది? ఆమెకు అంత సీన్ ఉందా? లేదంటే మరెవడైనా కొనిచ్చాడా? అంటూ రకరకాల చర్చలు చేశారు.ఆ చర్చలను చూసినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని చెప్పింది హిమజ.

అయితే వ్యాఖ్యలపై స్పందించాలి అనుకున్నా.ఎవరో పిచ్చోళ్లు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పట్టించుకోలేదని వెల్లడించింది.

అయితే ఒకానొక సమయంలో ఈ కామెంట్లు మరీ ఎక్కువగా వచ్చాయని చెప్పింది.

Telugu Actesshimaja, Bigg Boss, Boggboss, Flats, Himaja, Himana, Luxury Cars, To

ఆ సమయంలో కారుతో పాటు ఇంటికి సంబంధించిన ఈఎంఐల డాక్యుమెంట్లు లైవ్ లో వచ్చి చూపించాలి అనకున్నట్లు చెప్పింది.ఎన్నో ఏండ్లుగా టీవీ రంగంలో, సినిమా రంగంలో ఉన్న తనకు ఓ ఫ్లాట్, ఓ లగ్జరీ కారు ఉండవా? అని ప్రశ్నించింది.బ్యాంకులు జీరో ఇంట్రెస్ట్ తో ఈఎంఐలు ఇస్తుంటే.

అదీ ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు ఉన్న తనకు ఎందుకు ఈఎంఐలు ఇవ్వరా? అని ఆమె ప్రశ్నించింది.

Telugu Actesshimaja, Bigg Boss, Boggboss, Flats, Himaja, Himana, Luxury Cars, To

ఎక్కడా పనీ పాటా లేని వారంతా సోషల్ మీడియాలో జమై.ఇలాంటి పనికి రాని చర్చలు చేస్తారని చెప్పింది.అందుకే అలాంటి చెత్త ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దు అనుకున్నట్లు వెల్లడించింది.

వారి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోవడం ఇష్టం లేదని చెప్పింది ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube