భర్తకు తెలీకుండా పూరీకి డబ్బులిచ్చా.. హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరనే సంగతి తెలిసిందే.దాదాపు రెండు దశాబ్దాలుగా పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

 Actress Hema Share Relation With Director Puri Jagannaadh-TeluguStop.com

వేగంగా సినిమా కథలను రాయడంతో పాటు ఆ సినిమాలను అంతే వేగంగా తెరకెక్కించడం పూరీ జగన్నాథ్ ప్రత్యేకత.తాజాగా నటి హేమ పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

పూరీ జగన్నాథ్ తో అనుబంధం గురించి మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ లవ్ చేసిన అమ్మాయితో తామే స్వయంగా పెళ్లి చేశామని తెలిపారు.ఇప్పటికీ పూరీ జగన్నాథ్ తో తనకు మంచి అనుబంధం ఉండేదని ఆ సమయంలో పూరీ జగన్నాథ్ కు అవసరమైతే డబ్బులు ఇచ్చేదానినని హేమ వెల్లడించారు.

 Actress Hema Share Relation With Director Puri Jagannaadh-భర్తకు తెలీకుండా పూరీకి డబ్బులిచ్చా.. హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూరీ నేను బ్రదర్ సిస్టర్ లా ఉండేవాళ్లమని తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తరుణంలో పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవారని హేమ తెలిపారు.

పూరీ జగన్నాథ్ ఆ సమయంలో సింగిల్ ఎపిసోడ్లకు దర్శకత్వం వహించేవారని అప్పుడే పూరీ జగన్నాథ్ తో తనకు పరిచయం ఏర్పడిందని హేమ అన్నారు.

పూరీ ఎప్పుడైనా ఖర్చులకు డబ్బులు అవసరమైతే తననే అడిగేవారని హేమ తెలిపారు.పూరీ జగన్నాథ్ తాను ఇచ్చిన డబ్బులను మళ్లీ తనకు తిరిగి ఇచ్చేవారని హేమ చెప్పుకొచ్చారు.

షూటింగ్ సమయంలో లావణ్యను ప్రేమించి పూరీ జగన్నాథ్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడని హేమ అన్నారు.

పూరీ జగన్నాథ్ ఒకే అమ్మాయిని ప్రేమించారని ఆయనకు ఒక్కరే భార్య ఉంటారని హేమ పేర్కొన్నారు.

పూరీకి తాను అక్కను కావడంతో పాటు అత్తను అవుతానని పెద్దవాళ్లు ఎవరూ లేకపోతే తాను, తన భర్త కలిసి కాళ్లు కడిగి కన్యాదానం చేశామని హేమ చెప్పుకొచ్చారు.

#Hema #Lavanya #Relationship #PuriJagannadh #Money Loan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు