త్రివిక్రమ్‌ ఎవడండీ... హేమ సంచలన వ్యాఖ్యలు  

Actress Hema Sensational Comments On Trivikram -

తెలుగు సినీ ప్రేక్షకులకు హేమ ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆమద్య బ్రహ్మానందంకు కోవై సరల తర్వాత అద్బుతమైన భాగస్వామ్యంను ఇచ్చిన హేమ ప్రస్తుతం మెల్ల మెల్లగా కనుమరుగవుతూ వస్తోంది.

Actress Hema Sensational Comments On Trivikram

కెరీర్‌ ఆరంభంలో త్రివిక్రమ్‌ ఈమెకు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు ఇచ్చాడు.త్రివిక్రమ్‌ సినిమాల వల్లే ఈమెకు మంచి ఆధరణ, గుర్తింపు దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

త్రివిక్రమ్‌ ఈమెకు ఇచ్చిన అతడు, జులాయి, అత్తారింటికి దారేది చిత్రాలు హేమ కెరీర్‌లో కీలకంగా చెప్పుకోవచ్చు.అంతటి లైఫ్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది.

త్రివిక్రమ్‌ ఎవడండీ… హేమ సంచలన వ్యాఖ్యలు-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ గత కొంత కాలంగా త్రివిక్రమ్‌ సినిమాల్లో నటించక పోవడానికి కారణం ఏంటీ అనే ప్రశ్నకు ఆశ్చర్యకర సమాధానం ఇచ్చింది.ఒక సినిమా సమయంలో నా పారితోషికం విషయంలో త్రివిక్రమ్‌ ఇన్వాల్వ్‌ అయ్యాడు.ఒక నటి లేదా నటుడి పారితోషికంను డిసైడ్‌ చేసే హక్కు నిర్మాతకు మాత్రమే ఉంటుంది.ఒక సినిమా నిర్మాణ బాధ్యతలు మొత్తం నిర్మాత చూసుకుని పారితోషికం ఆయన డిసైడ్‌ చేయాలి.

కాని మద్యలో దర్శకుడు ఎవరండీ పారితోషికంను డిసైడ్‌ చేయడానికి, నన్ను ఒక సినిమా కోసం అంత పారితోషికం ఇచ్చి ఆమెను ఎంపిక చేయండి అంటూ నిర్మాతలకు త్రివిక్రమ్‌ చెప్పాడట.

త్రివిక్రమ్‌ ఎవడండీ నా పారితోషికం డిసైడ్‌ చేయడానికి, నేను చెప్పిన పారితోషికం ఇస్తే ఇవ్వండి, లేదంటే నన్ను నిర్మాతలు ఒప్పించాలి, బడ్జెట్‌ ఇష్యూ అని, ఇబ్బందని ఏదో రకంగా నన్ను ఒప్పించాలి.కాని త్రివిక్రమ్‌ నాకు ఒక రేటు నిర్ణయించడం ఏంటంటూ హేమ ఆగ్రహం వ్యక్తం చేసిందట.అప్పటి నుండి కూడా త్రివిక్రమ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నాను.

ఆయన కనిపించినా కూడా మొహం తిప్పుకుంటున్నాను.ఆయనకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని హేమ తేల్చి చెప్పింది.

తాజాగా తాను చేసిన వినయ విధేయ రామ సినిమాలోని పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని, త్రివిక్రమ్‌ మాత్రమే తనకు లైఫ్‌ ఇవ్వలేదని హేమ పేర్కొంది.హేమ వ్యాఖ్యలపై త్రివిక్రమ్‌ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Hema Sensational Comments On Trivikram- Related....