శివబాలాజీ చేతిని అందుకే కొరికాను.. షాకింగ్ విషయాలను రివీల్ చేసిన హేమ!

గతేడాది అక్టోబర్ నెలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఎన్నికల సమయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి.

 Actress Hema Reveals Bout Shivabalaji Incident Details, Actress Hema, Actor Shiv-TeluguStop.com

ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు విష్ణు ప్యానెల్ సభ్యులపై, విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశారు.ఎన్నికల రోజున హేమ శివబాలాజీ చెయ్యిని కొరకడం వివాదమైంది.

తాజాగా హేమ మాట్లాడుతూ నరేష్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో సంవత్సరం పాటు కరోనా లేదని హేమ తెలిపారు.

కొత్త కమిటీ పని చేస్తుందో లేదో నాకు అవగాహన లేదని హేమ అన్నారు.

ఎన్నికల రోజున ప్రకాష్ రాజ్ గన్ మేన్ కు కూడా అనుమతి లభించలేదని అవతలి ప్యానల్ సభ్యులకు సంబంధిన వారు మాత్రం వచ్చేశారని హేమ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నేను శివబాలాజీ చెయ్యిని కొరకడం వివాదాస్పదమైందని హేమ తెలిపారు.

ప్రకాష్ రాజ్ వద్దని చెప్పడంతో ఆరోజు నేను మీడియాకు ఎందుకు ఆ విధంగా చేశానో చెప్పలేకపోయానని హేమ అన్నారు.

ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘటనల వల్ల ప్రకాష్ రాజ్ ఐదుసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని హేమ తెలిపారు.

Telugu Shivabalaji, Actress Hema, Hema, Hemabites, Maa, Manchu Vishnu, Artist, N

ఒకతను అతని ప్యానల్ కు ఓటేయాలని చెబుతూ పాంప్లెట్ పంచుతున్నారని ఆ విషయం మీడియాకు తెలిస్తే ఎలక్షన్ ఆగిపోతుందని ప్రకాష్ రాజ్ భావించారని ప్రకాష్ రాజ్ గాంధీ మార్గంలో వెళ్లారని హేమ తెలిపారు.అక్కడ పబ్లిసిటీ చేయొద్దని చెప్పినా రాజేశ్వరి అనే అవతలి ప్యానల్ సభ్యురాలు ప్రచారం చేశారని హేమ అన్నారు.

Telugu Shivabalaji, Actress Hema, Hema, Hemabites, Maa, Manchu Vishnu, Artist, N

ఒకబ్బాయిని నరేష్ ప్యానల్ సభ్యులు కొడుతుండగా నేను వెళ్లడానికి ప్రయత్నిస్తే శివబాలాజీ చెయ్యి అడ్డుపెట్టి ఆపారని నేను ఎంత చెప్పినా వినకపోవడంతో తాను చెయ్యి కొరకడానికి ప్రయత్నించానని తాను చెయ్యి కొరకలేదని ఆమె అన్నారు.ఆ సమయంలో మీడియాలో తప్పుగా ప్రచారం జరిగిందని హేమ తెలిపారు.శివబాలాజీ ఎంత విలనో చూడండని హేమ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube