నటి హేమను హాట్ అన్న నెటిజన్.. దాంతో ఆమె..?

బుల్లితెరపై కమెడియన్ రోల్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును హేమ సొంతం చేసుకున్నారు.దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హేమకు ఇప్పటికీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

 Actress Hema Reply To Netizens Comments In Instagram Live Chat-TeluguStop.com

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు హేమకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.తానా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన హేమ తనకు కరోనా వచ్చిపోయిందని తెలిపారు.

తాను కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నానని హేమ తెలిపారు.ఆ తరువాత ఒక నెటిజన్ లుకింగ్ హాట్ అని కామెంట్ పెట్టగా తాను చూడటానికి పిచ్చిదానిలా ఉన్నానని ఎవరైనా చూస్తే కాయిన్ వేసి వెళ్లిపోతారని హేమ పేర్కొన్నారు.

 Actress Hema Reply To Netizens Comments In Instagram Live Chat-నటి హేమను హాట్ అన్న నెటిజన్.. దాంతో ఆమె..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలామందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించడం లేదని కరోనా లక్షణాలు ఉంటే పరీక్షల్లో నెగిటివ్ వస్తే సీటీ స్కాన్ చేయించుకుంటే మంచిదని హేమ పేర్కొన్నారు.

అభిమానులది స్వార్థం లేని ప్రేమ అని అక్కా అని పిలవాలంటే గట్స్ ఉండాలని హేమ పేర్కొన్నారు.

అందరూ తనను బాగా చూసుకుంటారని అందువల్ల తాను కూడా అందరినీ బాగా చూసుకుంటానని హేమ పేర్కోన్నారు.అభిమానుల వల్ల తాను చాల స్ట్రాంగ్ గా ఉన్నానని హేమ పేర్కొన్నారు.పెళ్లిసందడి2, వైష్ణవ్ తేజ్ రెండో సినిమాలో తాను నటిస్తున్నానని హేమ వెల్లడించారు.

తన ముక్కు కొంచెం వంకరగా ఉంటుందని యాక్సిడెంట్ కావడం వల్ల ఆ విధంగా జరిగిందని హేమ తెలిపారు.దాదాపు 200 సినిమాలలో నటించిన హేమ బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.తన చుట్టుపక్కన ఎవ్వరూ లేరని అందుకే తాను మాస్క్ తీసేశాని ఆమె వెల్లడించారు.

కొత్త హీరోలతో తెరకెక్కుతున్న సినిమాలలో కూడిన తాను నటిస్తున్నానని లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఆగిపోయాయని ఆమె అన్నారు.

#InstagramLive #Actress Hema

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు