మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల బరిలో న‌టి హేమ.. !

ఒకప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ అంటే పెద్దగా ఎవరు ఆసక్తి కనబరచక పోయేవారు.కానీ రాను రాను మా అధ్యక్ష బరిలోకి సినీతారలు ప్రవేశించడంతో ఈ ఎన్నికలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి.

 Actress Hema Participating In Maa President Elections, Actress Hema, Participati-TeluguStop.com

ఇక మా అధ్యక్షుడిగా నటుడు శివాజీ రాజా ఉన్నప్పటి కంటే ఆయన పదవీకాలం ముగిసి మళ్ళీ పోటీలో నిలబడినప్పటి నుండి ప్రతి సారీ జరుగుతున్న ఈ ఎన్నికల్లో వివాదాలు రాజుకుంటున్నాయి.ముఖ్యంగా పాత కార్యవర్గం మరియు కొత్తగా పోటీ చేయబోయే వర్గాల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడమే కాకుండా మాటల యుద్ధం కూడా సాగడం తెలిసిందే.

ఇక గత ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పోటీలో ఉన్న సమయంలో జరిగిన రచ్చ మామూలుగా లేదు.చివరికి సీనీయర్ నటులు జోక్యం చేసుకోవలసిన పరిస్దితి నెలకొంది.

ఇకపోతే ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ సారీ జరిగే ఎన్నికల్లో స్టార్ స్టేటస్ ఉన్న నటులు కూడా ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్దం అయ్యారట.అందులో సీనియర్ నటుడు ప్ర‌కాశ్ రాజ్‌, హీరో మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ ఉండగా తాజాగా సీనియ‌ర్ న‌టి హేమ ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా ఈ సారి అయిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయో లేదో అనే చర్చ ఫిలిం నగర్‌లో అప్పుడే మొదలైందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube