మా ఎన్నికల్లో హేమ సంచలనం... నలుగురు మగాళ్లను ఓడించింది  

Actress Hema Gets Very Excited After Winning Maa Elections-maa Elections 2019,naresh Panel,shivaji Raja Panel

రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నికలు ముగిశాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌ నమోదు అయ్యింది. భారీ ఎత్తున ఓట్లు నమోదు అవ్వడంతో ముందే గెలుపుపై నరేష్‌ ధీమా వ్యక్తం చేశాడు..

మా ఎన్నికల్లో హేమ సంచలనం... నలుగురు మగాళ్లను ఓడించింది-Actress Hema Gets Very Excited After Winning MAA Elections

అనుకున్నట్లుగానే నరేష్‌ ప్యానల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. శివాజీ రాజా ప్యానల్‌ ఓడిపోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నటి హీరో తనదైన ప్రత్యేకతను చాటుకుంది.

ఈ ఎన్నికల్లో ఎవరి ప్యానల్‌ తరపున పోటీ చేయకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలి పదవికి పోటీ చేసింది.

హేమతో పాటు మరో నలుగురు కూడా ఆ స్థానంకు పోటీ చేయడం జరిగింది. అయితే హేమ మాత్రం సంచలనంగా నరేష్‌ ప్యానల్‌ క్యాండెంట్స్‌ కూడా కాదని హేమను ఎంపిక అయ్యింది.

హేమతో విభేదాల కారణంగా నరేష్‌ మరియు శివాజీ రాజాలు ఆమెకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని, దాంతో ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిందని తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఆమె గెలుపు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

గెలుపొందిన అనంతరం హేమ మాట్లాడుతూ… తాను నలుగురి మగాళ్లపై గెలుపొందాను, నన్ను ఓడించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇండస్ట్రీలోని ఆడవారు నన్ను గెలిపించారు.

వారందరికి నా కృతజ్ఞతులు. ప్రతి ఒక్కరి ఓటుకు న్యాయం చేస్తాను. నేను ఏవైతే హామీలు ఇచ్చానో వాటిని తప్పకుండా నెరవేర్చుతాను అంటూ హేమ చెప్పుకొచ్చింది..