చంపేస్తామని కాల్స్ చేసి నటి హేమను బెదిరించారట.. ఏం జరిగిందంటే?

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ రోల్స్ లో నటించి హేమ ప్రేక్షకులను మెప్పిస్తున్నారనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీని లేడీ కమెడియన్ల కొరత వేధిస్తుండగా హేమ చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలను అంది పుచ్చు కుంటున్నారు.

 Actress Hema Comments About Blockmail Calls Detils Here , Blockmail Calls, Detai-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ నా ఫోన్ ఐ ఫోన్ అని మా ఎన్నికల సమయంలో బ్లాక్ మెయిల్ చేస్తూ తనకు కాల్స్ చేశారని హేమ వెల్లడించారు.

ఐ ఫోన్ లో కాల్స్ ను రికార్డ్ చేయడం సాధ్యం కాదని కరాటే కళ్యాణి, నరేష్ పై కంప్లైంట్ ఇచ్చినందుకు ఒక వ్యక్తి కాల్ చేసి ఏంటే.

కంప్లైంట్ ఇస్తున్నావ్.చంపేస్తాను అంటూ మాట్లాడాడని హేమ చెప్పుకొచ్చారు.

నేను హా అన్న వెంటనే ఆ వ్యక్తి కాల్ కట్ చేశాడని హేమ కామెంట్లు చేశారు.నన్ను బెదిరించడానికి వాడు ఫోన్ చేశాడని కాని ఫోన్ చేశాక వాడే భయపడ్డాడని హేమ కామెంట్లు చేశారు.

మా ఇంట్లో తానే ధైర్యవంతురాలినని హేమ అన్నారు.

Telugu Blockmail, Hema-Movie

తాను ఎలాంటి పరిస్థితి వచ్చినా సులభంగా హ్యాండిల్ చేస్తానని కుటుంబ సభ్యులు నమ్ముతారని హేమ కామెంట్లు చేశారు.ఆ తర్వాత సిమ్ కార్డ్ ను సామ్ సంగ్ ఫోన్ లో వేశానని ఆ వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి కాల్ కట్ చేశాడని తాను మీడియాకు వెళతానంటే ప్రకాష్ రాజ్ వదిలేయమని చెప్పారని హేమ అన్నారు.స్క్రీన్ షాట్స్ తీసుకుని పోలీసులకు పంపించానని హేమ తెలిపారు.

నన్ను ఎవరూ ఏమీ చేయలేరని హేమ చెప్పుకొచ్చారు.

ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా భగవంతుడు ఏదో ఒకరోజు దెబ్బ కొడతాడని హేమ కామెంట్లు చేశారు.

నేను నా లైఫ్ లో తప్పు చేయననే కాన్ఫిడెన్స్ తో ఉన్నానని హేమ కామెంట్లు చేశారు.డిగ్రీ చేయాలని అనిపించి కొంతమంది సలహాలు తీసుకుని పరీక్షలు రాశానని హేమ అన్నారు.

చదవడం ద్వారా నాలెడ్జ్ వస్తుందని హేమ కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube