భర్తను ప్రేమించాల్సి వచ్చింది.. హరితేజ కామెంట్స్ వైరల్..?

బుల్లితెర సీరియళ్లలో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ హరితేజ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సాధారణంగా చాలామంది యాక్టర్లు సినిమాల్లో ఆఫర్లు తగ్గిన తరువాత సీరియళ్ల వైపు చూస్తారు.

 Actress Hariteja Interesting Comments About Her Love Story,latest News-TeluguStop.com

కానీ హరితేజకు మాత్రం సీరియళ్ల ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ద్వారా హరితేజ తన టాలెంట్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు ఎన్టీఆర్ మెప్పు కూడా పొందారు.

తాజాగా ఒక నెటిజన్ హరితేజ లవ్ స్టోరీ గురించి అడగగా ముందు ఆయన ప్రేమించారని తరువాత తాను ప్రేమించాల్సి వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమాల్లో కమెడియన్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తూ మెప్పిస్తున్న హరితేజకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

ఫాలోవర్లతో హరితేజ నిత్యం టచ్ లో ఉండటంతో పాటు అభిమానులు అడిగిన ప్రశ్నలకు హరితేజ తనదైన శైలిలో సమధానాలు ఇస్తారు.

కొన్ని రోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ గర్భంతో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతాఇంతా కాదు.

గర్భంతో ఉన్న సమయంలో హరితేజ డ్యాన్స్ చేసిన వీడియోలు, హరితేజ సీమంతం యొక్క వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.హరితేజది లవ్ మ్యారేజ్ అని ఆమె అభిమానులలో కొంతమందికి తెలుసు.

అయితే ఒక నెటిజన్ సైతం హరితేజకు సంబంధించి ఇదే ప్రశ్న అడిగారు.

ఒక నెటిజన్ మీది లవ్ మ్యారేజా.? అరేంజ్డ్ మ్యారేజా.? అనే ప్రశ్నకు హరితేజ స్పందిస్తూ మన్మథుడు సినిమాలో డైలాగ్ చెప్పారు.మొదట ఆయన తనను ప్రేమించారని ఆ తరువాత తాను ప్రేమించాల్సి వచ్చిందని హరితేజ వెల్లడించారు.ఇద్దరూ ప్రేమించుకోవడంతో ఇంట్లో వాళ్లకు ఆప్షన్ ఏముందని హరితేజ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube