బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముంబై ముద్దుగుమ్మ హన్సిక(Hansika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె అనంతరం అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన దేశముదురు (Desamuduru) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు.
అయితే మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హన్సిక అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు.ఇలా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన హన్సిక ఈ మధ్య కాస్త సినిమాలను తగ్గించిందని చెప్పాలి.

ఇలా సినిమాలను తగ్గించిన ఈమె తన వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.గతేడాది డిసెంబర్ నెలలో తాను ప్రేమించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇలా హన్సిక పెళ్లి తర్వాత కూడా సినిమాలకు దూరం కాకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా హన్సిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈమెను ఒక టాలీవుడ్ హీరో తనతో డేట్ చేయాలి అంటూ వెంటపడినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని స్వయంగా హన్సిక గతంలో వెల్లడించిందని గత రెండు రోజులుగా ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.

ఇక ఈ రూమర్స్ హన్సిక వరకు చేరడంతో ఈ రూమర్లపై హన్సిక స్పందించి క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్నీ ఆ వాస్తవమేనని తెలియజేశారు.ఒక వార్తను పబ్లిష్ చేసేటప్పుడు ఒకసారి ఆ వార్తను క్రాస్ చెక్ చేసుకోవాలని ఈమె కోరారు.గుడ్డిగా పబ్లిష్ చేసేముందు వాస్తవాన్ని కూడా ఒకసారి గమనించండి.ప్రస్తుతం తన గురించి ప్రచారం అవుతున్నటువంటి ఈ వ్యాఖ్యలను తాను ఎప్పుడూ చేయలేదు అంటూ ఈ సందర్భంగా తనని హీరో వేదిస్తున్నాడంటూ వస్తున్నటువంటి వార్తలు ఏ మాత్రం నిజం లేదని అదంతా ఆ వాస్తవమేనని హన్సిక ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చేశారు.ప్రస్తుతం హన్సిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.