Hansika Mehendi Function: ఘనంగా హన్సిక మెహందీ వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

హన్సిక మొత్వానీ బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం పలు యాడ్స్ ద్వారా సందడి చేసిన ఈ ముంబై ముద్దుగుమ్మ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.15 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.హన్సిక మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించడంతో ఈమెకు అనంతరం వరుస తెలుగు సినిమా అవకాశాలతో పాటు తమిళ సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా ఇండస్ట్రీలో దశాబ్దన్నర కాలంగా కొనసాగుతున్నటువంటి హన్సిక త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంది.

 Actress Hansika Mehendi Function Pics Viral Details, Actress Hansika , Hansika M-TeluguStop.com

హన్సిక ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్‌నర్ అయిన సొహైల్ కతూరియాని వివాహం చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.డిసెంబర్ 4వ తేదీ రాజస్థాన్లోని ఒక రాయల్ ప్యాలెస్ వీరి వివాహం ఎంతో ఘనంగా జరగనుంది.

ఈ క్రమంలోనే విదేశాలలో హన్సిక తన బ్యాచిలర్ పార్టీని ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇకపోతే తాజాగా ఈమె ఇంట పెళ్లి వేడుకలు మొదలైనట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే హన్సిక మెహందీ వేడుకలు ప్రారంభం కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హన్సిక రెండు చేతులకు ఎంతో అద్భుతంగా మెహంది పెట్టుకొని సందడి చేస్తున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోలో ఆమెకు కాబోయే భర్త సోహెల్ కూడా ఉండడం విశేషం.ప్రస్తుతం హన్సిక కుటుంబ సభ్యులందరూ కూడా రాజస్థాన్ జైపూర్ చేరుకున్నారు.ఇప్పటికే పెళ్లి పనులన్నీ కూడా ఎంతో ఘనంగా ప్రారంభం కావడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube