నువ్వే నా ప్రపంచం.. దేశముదురు బ్యూటీ ఎమోషనల్ పోస్ట్..?

పదహారేళ్ల వయస్సులోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక తొలి సినిమా దేశముదురుతో స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటించిన హన్సిక తన తల్లి గురించి తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

 Actress Hansika Emotional Post In Instagram On Her Mothers Birthday , Four Movie-TeluguStop.com

తన జీవితంలో అమ్మ ఎంతో స్పెషల్ అని హన్సిక చెప్పుకొచ్చారు.తల్లితో ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని ఆమె అన్నారు.

తన తల్లి పుట్టినరోజు కావడంతో హన్సిక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు తల్లి మోనా మత్వానీ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనే విషయం తాను మాటల్లో చెప్పలేనని చెప్పుకొచ్చారు.అమ్మే తన ప్రపంచమని మంచి జీవితాన్ని ఇచ్చిన అమ్మకు ధన్యవాదాలు అని హన్సిక చెప్పుకొచ్చారు.

మోనా మత్వానీ డెర్మటాలజిస్ట్ కాగా ఆమె తన ఇద్దరు పిల్లలను పెంచి పోషించారు.హన్సికకు ఒక సోదరుడు ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు హన్సిక బాలనటిగా తన సినీ కెరీర్ ను మొదలుపెట్టారు.హీరోయిన్ గా విజయాలను సొంతం చేసుకుని తెలుగుతో పాటు ఇతర భాషల్లో హన్సిక మంచి పేరును సంపాదించుకున్నారు.తమిళంలో హన్సిక నటించిన కొన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను అందుకున్నాయి.హన్సిక శింబుతో గతంలో ప్రేమలో ఉన్నట్టు వైరల్ అయినా ఆ వార్తల గురించి హన్సిక మాత్రం స్పందించి వివరణ ఇవ్వలేదు.

హన్సిక శింబు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం హన్సిక నాలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే హన్సికకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు అయినా హన్సిక కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube