టాలీవుడ్ ముద్దుగుమ్మలలో ఒకరైన హంసనందిని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను పలకరిస్తూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.తన అంద చందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హంసానందిని తన హాట్ స్టిల్స్ తోపాటు అప్పుడప్పుడు కొన్ని వంటలను కూడా చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.అవి కూడా నెటిజన్లను ఆకట్టుకుంటాయి.
పూణేకు చెందిన ఈ భామ ఒక్కటవుదాం సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైంది.అయితే ఈ పొడుగు కాళ్ళ సుందరి అందం, అభినయం ఉన్నప్పటికీ ఎక్కువ రోజులు హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
తర్వాత స్టార్ హీరోల సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టింది.మిర్చి సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ తో బాగా పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ.

ఈ బ్యూటీ చివరిసారిగా 2018లో పంతం సినిమాలో నటించింది.ఆ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉంటుంది.తన సినిమాల గురించిన ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.సినిమాలు లేకపోయినప్పటికీ ఎప్పుడు సోషల్ మీడియాలో ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది.ప్రేక్షకులు తనని మర్చిపోకుండా ఉండడానికి ఏదొక అప్ డేట్ ఇస్తూ ఎప్పుడు టచ్ లో ఉంటుంది.
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన హాట్ స్టిల్స్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సరదాగా రోడ్ ట్రిప్ చేస్తూ మధ్యలో ఒక షాప్ దగ్గర దిగిన స్టిల్స్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో తనతో పాటు తన పెట్ కూడా ఉంది.తన పెట్ ను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఈ పిక్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.