ప్రియదర్శి, గౌరి ప్రియారెడ్డి, హర్శిత్ మల్గిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించి గుర్రాల ఉదయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మెయిల్.ఈ నెల 12వ తేదీన ఆహా ఓటీటీలో ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి గౌరి ప్రియ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మెయిల్ సినిమాలో నటనకు మంచి ప్రశంసలు దక్కాయని గౌరి ప్రియ చెప్పుకొచ్చారు.
స్నేహితులు, బంధువులు నటన గురించి మెచ్చుకుంటున్నారని మెయిల్ సినిమా ద్వారా వచ్చిన పేరు గురించి తాను మాటల్లో వర్ణించలేనని ఆమె అన్నారు.తాను పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ లోనే జీవనం సాగించానని అయితే మెయిల్ సినిమా కొరకు రెండు నెలలు తండాకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.తాను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ హాస్టల్ లో ఉండలేదని అయితే ఈ సినిమా కోసం నెలన్నర రోజులు మహబూబాబాద్ లోని బాయ్స్ హాస్టల్ లో ఉన్నామని చెప్పారు.
తనతో పాటు హెయిర్ డ్రెస్సర్ మాత్రమే అమ్మాయని.
అమ్మాయిలం ఇద్దరమే అయినా ఎటువంటి ఇబ్బంది పడలేదని గౌరి ప్రియ చెప్పుకొచ్చారు.డిగ్రీ వరకు చదివానని అమ్మ హౌస్ వైఫ్ కాగా నాన్న ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తారని గౌరిప్రియ తెలిపారు.
తొమ్మిదో తరగతి చదివే సమయంలో బోల్ బేబీ బోల్ సీజన్ 2లో పాల్గొని విన్నర్ గా నిలిచానని తాను మనస్తత్వానికి నచ్చిన పనులనే ఎక్కువగా చేస్తానని గౌరి ప్రియ చెప్పుకొచ్చారు.
కాజేలో మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ స్టాల్ పెట్టగా అందులో పాల్గొన్నానని ఆ ఫోటోలో విన్నర్ గా నిలవడంతో సినిమాల్లో అవకాశాలు అవకాశాలు వస్తున్నాయని ఆమె అన్నారు.
ప్రస్తుతం మెయిల్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానని ఆమె అన్నారు.