నేను ప్రదీప్ తో డేటింగ్ చెయ్యలేదంటున్న నటి... మరి...

ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో లో ఇద్దరు ఆడ మగ వ్యక్తులు కొద్దిగా చనువుగా ఉంటే చాలు వారిని చూసినటువంటి జనాలు, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఈ ఇద్దరి గురించి ఉన్నవి, లేనివి కల్పించి కొత్త కథలను సృష్టిస్తుంటారు.అయితే ఈ మధ్య కాలంలో దర్శకుడు శ్రీరామోజు సునిషిత్ టాలీవుడ్ ప్రముఖ యాంకర్ మరియు హీరో ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించినటువంటి పెళ్లి చూపులు లో కంటెస్టెంట్ గా పాల్గొన్న జ్ఞానేశ్వరి తో డేటింగ్ చేశాడని, అందుకు తగ్గ ఆధారాలు కూడా తనతో ఉన్నాయని పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 Actress Gnaneswari React About Pradeep Dating News-TeluguStop.com

అయితే తాజాగా జ్ఞానేశ్వరి ఈ విషయంపై స్పందించింది.ఇందులో భాగంగా తన పెళ్లి చూపులు షో కి కేవలం ఒక కంటెస్టెంట్ గా మాత్రమే వెళ్లానని ప్రదీప్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.

అంతేకాక ప్రస్తుతం ఉన్నటువంటి కొందరు జనాలకి ఉన్నవీ లేనివీ కల్పించి వారి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయింది.ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రదీప్ టాప్ యాంకర్ అని అతడిపై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను సృష్టించి పాపులర్ కావాలని కొందరు చూస్తున్నారని ఇలాంటివి మానుకుంటే మంచిదని హెచ్చరించారు.

అంతేకాక ఒక మనిషి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించడం ఎవరికీ మంచిది కాదని అన్నారు.

Telugu Anchor Pradeep, Gnaneswari, Pradeep Latest-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నటించాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పాటలు చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా మంచి స్పందన లభించింది.అంతేగాక ఈ చిత్రాన్ని ఈనెల 25 వ తారీఖున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube