భర్తతో గొడవ గుట్టు విప్పేసిన జెనీలియా..?  

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జెనీలియా.సత్యం, బొమ్మరిల్లు, ఢీ, రెడీ సినిమాలు హీరోయిన్ గా జెనీలియాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.2012లో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్న జెనీలియా వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు.ఈ సంవత్సరం ఆగష్టు నెలలో కరోనా బారిన పడ్డ జెనీలియా తగిన జాగ్రత్తలు తీసుకుని తక్కువ సమయంలోనే కోలుకున్నారు.

TeluguStop.com - Actress Genelia Interesting Comments About Her Husband

అయితే గత కొన్ని రోజుల నుంచి జెనీలియాకు, రితేష్ కు మధ్య గొడవలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.తాజాగా జెనీలియా వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పది సంవత్సరాలు డేటింగ్ చేసి రితేష్ ను వివాహం చేసుకున్న జెనీలియా తన భర్త ఎప్పుడూ గొడవ పడడని అన్నారు.రితేష్ దేశ్ ముఖ్ తో 20 సంవత్సరాలుగా బంధం ఉందని చాలామంది ఇంతకాలం ఎలా రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్నారని ప్రశ్నించారని తెలిపారు.

TeluguStop.com - భర్తతో గొడవ గుట్టు విప్పేసిన జెనీలియా..-General-Telugu-Telugu Tollywood Photo Image
Telugu 20 Years Relation, Actrees Genelia, Interesting Comments, Ritesh Deshmukh-Latest News - Telugu

తను, రితేష్ అన్ని విషయాలను చర్చించుకుంటామని.అలా చర్చించుకుంటే ఇతరుల జీవితాల్లో కూడా సమస్యలు రావని జెనీలియా అన్నారు.అయితే తమ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉండవని అనుకోవద్దని.కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య వాదనలు జరిగిన సందర్భాలు ఉన్నాయని.తాను భావోద్వేగానికి గురైన సందర్భాలు సైతం ఉన్నాయని అన్నారు.లైఫ్ లో ఇదంతా భాగం అని అనవసరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వబోమని తెలిపారు.

తన భర్తతో ఎక్కువగా బాధ పడిన విషయాల గురించే చర్చిస్తానని అలా చేయడం వల్ల భర్తతో బంధం మరింత బలపడుతుందని జెనీలియా అన్నారు.తను గొడవ పడాలనుకుంటే తప్ప భర్తతో గొడవలు జరగవని రితేష్ ను ఆ విషయంలో మెచ్చుకోవచ్చని జెనీలియా అన్నారు.

#Ritesh Deshmukh #Actrees Genelia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు