తెలుగు, తమిళం, హిందీల్లో పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ జెనీలియా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
తాజాగా ఈమె ఒక బాబుకు జన్మనిచ్చింది.ఈమె త్వరలోనే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానంటూ తాజాగా ప్రకటించింది.
ప్రస్తుతం తాను తల్లిగా మంచి ఆనందాన్ని పొందుతున్నానని, ఆ ఆనందంతో పాటు తాను నటిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ఈమె భావిస్తోంది.తనను సినిమాల్లో నటించేందుకు ఏ నిర్మాత లేక దర్శకుడు అయినా సంప్రదిస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఓపెన్ ప్రకటన చేసింది.
హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించింది.మరి ఈమెను ఏ దర్శకుడు రీ ఎంట్రీ చేయిస్తాడో చూడాలి.
జెనీలియాను ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులు కోరుకుంటూనే ఉన్నారు.