రామ్ గోపాల్ వర్మని పెళ్లి చేసుకోవాలని ఉందంటున్న టాలీవుడ్ నటి...  

Actress Gayathri Guptha Want To Marry Ram Gopal Varma - Telugu Actress Gayathri Guptha News, Gayathri Guptha Latest News, Gayathri Guptha News, Gayathri Guptha Want To Marry Ram Gopal Varma, Tollywood Director Rgv

ఒకప్పుడు టాలీవుడ్ లో మీటు ఉద్యమం ఎంతగా కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంతేగాక ఈ ఉద్యమం వల్ల అప్పట్లో కొందరు పేర్లు బయటకు వచ్చి మీడియా ముందు పెద్ద రచ్చ జరిగింది.

Actress Gayathri Guptha Want To Marry Ram Gopal Varma

అయితే ఈ విషయం ఇలా ఉండగా  అప్పట్లో ఈ మీటూ ఉద్యమంలో నటి గాయత్రీ గుప్తా కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు.

 దీంతో అడపాదడపా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తోంది.అయితే తాజాగా గాయత్రి గుప్తా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా గాయత్రి గుప్తా మాట్లాడుతూ తనకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే అమితమైన అభిమానం అని అన్నారు.అంతేకాక ఆయనని అర్థం చేసుకుంటే ఆయన ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించే మనిషి అని అందరికీ బాగా అర్థం అవుతుందిని అంటోంది ఈ అమ్మడు.

వయసులో రామ్ గోపాల్ వర్మ తనకంటే పెద్దవాడయ్యాడని లేకుంటే కచ్చితంగా పెళ్లి చేసుకునేదాన్నని  అన్నారు.ఒకప్పుడు తాను అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో రాంగోపాల్ వర్మ పిలిచి “ఐస్ క్రీం 2” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం కల్పించారని అన్నారు.

అంతేకాక ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ  “బ్యూటిఫుల్” చిత్రంలో నటించిన నటీనటులకు పార్టీ ఇచ్చారని ఆ పార్టీలో తాను రాంగోపాల్ వర్మ చేసుకున్నానని ఈ విషయానికి సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయని అన్నారు.అయినా ఆయన అంటే నాకు గౌరవం ఉందని మరియు ఆయనేంటో ప్రత్యక్షంగా చూసిన దాన్ని కాబట్టే రామ్ గోపాల్ వర్మ కి హగ్ ఇచ్చానన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

అయితే టాలీవుడ్లో చివరిగా ఈ అమ్మడు సంపూర్ణేష్ బాబు నటించిన టువంటి కొబ్బరిమట్ట అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు భార్య పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే నటన పరంగా ఫర్వాలేదనిపిస్తున్న గాయత్రి గుప్తా కి ఈ మధ్యకాలంలో కొంతమేర అవకాశాలు తలుపు తడుతున్నాయి.ఈ అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పలువురు గాయత్రీ గుప్తా అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Gayathri Guptha Want To Marry Ram Gopal Varma Related Telugu News,Photos/Pics,Images..

footer-test