హీరోయిన్‌కు గంటకు 2 లక్షలు ఇస్తానంటూ ఫేస్‌బుక్‌ ద్వారా కుర్రాడి ఆఫర్‌.. ఆమె ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే  

Actress Gayathri Arun Reacts To A Man Asking Her For Night-

హీరోయిన్స్‌ ఒక వైపు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేదింపుల గురించి కాస్టింగ్‌ కౌచ్‌, మీటూ అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే మరో వైపు వారికి వేదింపులు ఎదురవుతూనే ఉన్నాయి.మద్య ఒక హీరోయిన్‌కి దుబాయికి చెందిన వ్యక్తి కాల్‌ చేసి రేటు ఎంత అని అడిగిన విషయం తెల్సిందే.ఎంత కఠినంగా ప్రవర్తించినా, వ్యవహరించినా కూడా జనాలు మాత్రం మారడం లేదు...

Actress Gayathri Arun Reacts To A Man Asking Her For Night--Actress Gayathri Arun Reacts To A Man Asking Her For Night-

కొందరు మగాళ్లు అత్యంత హీనంగా దారుణంగా ఆడవారి గురించి ప్రశ్నిస్తున్నారు.తాజాగా మలయాళ హీరోయిన్‌ గాయత్రి అరుణ్‌ను సోషల్‌ మీడియా ద్వారా రోహన్‌ అనే కుర్రాడు ఒక రాత్రికి వస్తావా అంటూ కోరాడు.

Actress Gayathri Arun Reacts To A Man Asking Her For Night--Actress Gayathri Arun Reacts To A Man Asking Her For Night-

ఒక రోజు రాత్రి, అది కూడా ఒక్క గంటకు రెండు లక్షల రూపాయలు ఇస్తాను, ఈ విషయం మన మద్య తప్ప మరెక్కడ పొక్కదు అంటూ ప్రామీస్‌ కూడా చేశాడు.అతడు చేసిన మెసేజ్‌ను హీరోయిన్‌ స్క్రీన్‌ షాట్‌ తీసి మరీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

దాంతో ఆ కుర్రాడు బుక్‌ అయ్యాడు.మీ అమ్మ మరియు సోదరిల భద్రత గురించి నేను ప్రార్ధిస్తాను అంటూ కూడా హీరోయిన్‌ గాయత్రి ట్విట్టర్‌ ద్వారా పేర్కొనడం సంచలనం అయ్యింది..

ఆ కుర్రాడి వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే అని, అందుకే అతడిపై లైంగిక వేదింపుల కేసును పెట్టలేదని పేర్కొంది.అతడి తల్లిదండ్రులు కోరిక మేరకు అతడిని విడిచి పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది.

ఇలాంటి ఆకతాయిలు ఎంతో మంది ఎదురు అవుతూనే ఉంటారని, కాని నీచంగా ప్రవర్తించే వారు మాత్రం ఎప్పటికి బాగుపడరు అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి...

తనను ఒక రాత్రికి వస్తావా అంటూ అడిగిన రోహన్‌కు హీరోయిన్‌ గాయత్రి ఇచ్చిన షాక్‌ను అందరు అభినందిస్తున్నారు.ఇలా ధైర్యంగా ఉంటేనే ఏమైనా ఇలాంటి వారు తగ్గుతారు.లేదంటే మరీ రెచ్చి పోతారు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఆడవారిని కేవలం అంగడి బొమ్మ అనుకునే వారు ముందు వారి తల్లి మరియు సోదరి విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు.మరీ మైనర్‌గా ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో వారు ఎలా తయారు అవుతారో...

!