నటి గౌతమి చిరంజీవితో ఒక్క సినిమాలో కూడా ఎందుకు నటించలేదంటే?

సినిమా పరిశ్రమలో ప్రవేశించాలని చాలా మంది అనుకుంటారు.కాని కొద్ది మందికే అది సాధ్యమవుతుంది.

 Reason Behind Actress Gawthami Not Acted With Chiranjeevi, Chiranjeevi, Gawthami-TeluguStop.com

కొద్ది మందికే స్టార్ స్టేటస్ దక్కుతుంది.అయితే హీరోయిన్ గా సినిమా పరిశ్రమలో సెటిల్ అవ్వాలంటే చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి.

సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ పరిశ్రమ.ముఖ్యంగా హీరోయిన్ లకు అవకాశాలు రావడంలో గ్లామర్ అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది.

అయితే గ్లామర్ ఆధారంగా సినిమా పరిశ్రమకు వచ్చిన వారు పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండలేరు.అందం, అభినయం కలగలిసిన నటీమణులే ఎక్కువ కాలం ఉంటారు.

నటనా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ నటన అవకాశం గల పాత్రలలో నటిస్తే ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారు.ఇక అప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు.

ఈ కోవలోకే వస్తారు నటి గౌతమి.తెలుగు నటి అయినప్పటికీ తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన గౌతమి పలు తెలుగు సినిమాలలో కూడా నటించింది.

అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమి పరిశ్రమలో అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణతో కలిసి నటించలేక పోయానని గౌతమి తెలిపింది.అయితే చిరంజీవితో సినిమాలో చేద్దామని అనుకున్నప్పుడల్లా రజినీ కాంత్ సినిమా డేట్లతో ఇబ్బంది అయ్యేదని అందుకే  చిరంజీవితో నటించలేక పోయానని నటి గౌతమి తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube