రంజాన్ ఉపవాసంపై షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్.. ఆ నటి కౌంటర్ ఇదే!

Actress Gauhar Khan Shocking Counter Details Here Goes Viral , Actress Gauhar Khan, Gauhar Khan, Justin Bieber, Ramadan Fasting

ఈ మధ్య కాలంలో పాపులారిటీ ఉన్న కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్న చిన్నచిన్న తప్పులు వాళ్ల పరువు పోవడంతో పాటు ఇతర సెలబ్రిటీల దృష్టిలో వాళ్లు బ్యాడ్ అవ్వడానికి కారణమవుతున్నాయి.నటిగా, మోడల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న గౌహర్ ఖాన్( Gauhar Khan ) ప్రస్తుతం ఉపవాసం ఉండటం లేదు.

 Actress Gauhar Khan Shocking Counter Details Here Goes Viral , Actress Gauhar Kh-TeluguStop.com

ప్రస్తుతం గర్భంతో ఉండటం వల్ల తాను ఉపవాసం ఉండటం లేదని ఆమె వెల్లడించారు.

ఉపవాసం ఉండటానికి బదులుగా తాను నిరు పేదలకు ఆహారాన్ని పంపిణీ చేయాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.

అయితే హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్( Justin Bieber ) దంపతులు రంజాన్ ఉపవాసం( Ramadan fasting ) గురించి స్పందిస్తూ మైమేతే ఎప్పుడూ ఉపవాసం ఉండలేదని మా శరీరాలకు పోషకాలు కావాలని అందుకే ఎప్పుడూ అలా చేయమని చెప్పుకొచ్చారు.కడుపు మాడ్చుకుని ఉపవాసాలు చేయడం ఏంటో మాకు ఇప్పటికీ అర్థం కాదని వాళ్లు అన్నారు.

అంతగా అవసరం అనుకుంటే టీవీ చూడటం, సెల్ ఫోన్ వాడటం మానేయాలని వాళ్లు కామెంట్లు చేశారు.అంతే తప్ప తిండి మానేయడమేంటని మరీ తెలివి తక్కువగా ఉన్నారనిపిస్తోందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సింగర్ జంట పోస్ట్ తన దృష్టికి రావడంతో నటి గౌహర్ ఖాన్ సీరియస్ అయ్యారు.మీకేం తెలుసని మాట్లాడుతున్నారని నటి గౌహర్ ఖాన్ అన్నారు.

దాని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి సైన్స్ గురించి కాస్తైనా తెలుసా అని గౌహర్ ఖాన్ ప్రశ్నించారు.ముందు అవి తెలుసుకోవాలని గౌహర్ ఖాన్ అన్నారు.మీకంటూ అభిప్రాయం ఉండటం తప్పు కాదని ఆమె కామెంట్లు చేశారు.గౌహర్ ఖాన్ కామెంట్లకు నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు.జస్టిన్ బీబర్ దంపతులు తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Video : Actress Gauhar Khan Shocking Counter Details Here Goes Viral #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube