బాలీవుడ్ లో డబ్బు, అధికారం రాజ్యమేలుతున్నాయి అంటున్న ఎవ్లీన్ శర్మ

బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది.అందులో వారసత్వ నటులు, వారిని ప్రోత్సహించే వారు ఒక వైపు ఉండగా మరో వైపు వారసత్వాన్ని వ్యతిరేకించే వారు, వారి వలన అవకాశాలు కోల్పోయిన నటులు మరో వైపు ఉన్నారు.

 Actress Evelyn Sharma Opines On Nepotism In Bollywood, Tollywood, Indian Cinema,-TeluguStop.com

ఇప్పుడు ఈ రెండు వర్గాలు మాటల దాడి చేసుకుంటున్నారు.సుశాంత్ ఆత్మహత్యతో మొదలైన ఈ వార్ తారాస్థాయికి చేరుకుంటుంది.

చాలా మంది వారసత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.వారి వలన తాము అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ గ్రూప్ లో బాలీవుడ్ హాట్ భామ ఎవ్లీన్ శర్మ వచ్చి చేరింది.బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో ముందుగా నన్ను ఎంపిక చేసి రాత్రికి రాత్రి ఆ సినిమాల నుంచి నన్ను తొలగించారని పేర్కొంది.

కొందరికి బాగా కావాల్సిన వాళ్ల కోసమే తనను తీసేశారని తెలిసి ఎంతో బాధపడ్డానని ఈ సందర్భంగా తన ఆవేదనని సోషల్ మీడియాలో పంచుకుంది.కొన్ని సినిమాలు వచ్చినా వాటిలో తన ప్రతిభ చూపేందుకు అవకాశం రాలేదని, కొన్ని భయానక అనుభవాలుగా మిగిలిపోయాయని పేర్కొంది.

అయితే ఇలాంటి అనుభవాలతో తాను మరింత రాటుదేలిపోయానని తెలిపింది.బాలీవుడ్ లో డబ్బు, అధికారం రాజ్యమేలుతాయని, కానీ వాటిని పట్టించుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్టు ఎవ్లీన్ వెల్లడించింది.

నెపోటిజం కారణంగా తనలాంటి ఏంటో మంచి కొత్తవారు అవకాశాలు కోల్పోతున్నారని, వారసత్వ నటుల ఆధిపత్యం కారణంగా తమ కలలని నేరవేర్చుకోలేకపోతున్నామని ఎవ్లీన్ శర్మ వాపోయింది.సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో పెరిగిన వర్గపోరు ఎప్పటికి ముగిసిపోతుంది అనేది తెలియదు కాని, కలిసి సినిమాలు చేసుకోవాల్సిన వారి మధ్య వచ్చిన ఈ అంతరం సినిమా షూటింగ్ లు మళ్ళీ మొదలైన తర్వాత చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఇకపై సినిమాలు చేసే వారు కూడా రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.మరి బాలీవుడ్ లో ఏర్పడ్డ ఈ అంతరం ఎప్పటికి సమసిపోతుందో అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube