కేరళ ట్రాన్స్ జెండర్ హీరోయిన్ పెళ్లికూతురైంది- Actress Elizabeth Harini Chandana Has Tied The Knot With Suneesh

actress Elizabeth Harini Chandana has tied the knot with Suneesh-Malayalam Cinema- Tollywood-Transgender Women- Marriage- Equal Gender Marriages - Telugu Actress Elizabeth Harini Chandana, Equal Gender Marriages, Malayalam Cinema, Marriage, Tollywood, Transgender Women

సుప్రీంకోర్టు ఈక్వల్ జెండర్ వివాహాలని, రిలేషన్స్ ని చట్టబద్ధం చేసిన తర్వాత ఇండియాలో కూడా చాలా మంది ఒకే జెండర్ ఉన్న వారు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.ఈ కారణం వలెనే ఇండియాలో గే వివాహాలని కూడా చూస్తున్నాం.

 Actress Elizabeth Harini Chandana Has Tied The Knot With Suneesh-TeluguStop.com

తల్లిదండ్రులు కూడా పెద్ద మనసు చేసుకొని ఇలాంటి రిలేషన్ షిప్ ఉన్నవారికి తప్పుగా చూడకుండా ప్రోత్సహిస్తున్నారు.శారీరక లోపం కారణంగా వచ్చే గుణాలని ఎవరూ దూరం చేయలేరనే విషయాన్ని సమాజం కూడా మెల్లగా ఒప్పుకుంటుంది.

అందుకే ఈ మధ్యకాలంలో అమ్మాయిలుగా మారుతున్న అబ్బాయిలని చూస్తున్నాం.లింగమార్పిడి చేసుకొని ట్రాన్స్ జెండర్ విమెన్ గా మారిపోయి వారి జీవితాలని కొనసాగిస్తున్నారు.

 Actress Elizabeth Harini Chandana Has Tied The Knot With Suneesh-కేరళ ట్రాన్స్ జెండర్ హీరోయిన్ పెళ్లికూతురైంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంత మంది అయితే మోడలింగ్ రంగంలో, సినిమాలలో టీవీ షోలలో రాణిస్తున్నారు.హీరోయిన్స్ కూడా అవుతున్నారు.

అలాగే అబ్బాయి నుంచి ట్రాన్స్ జెండర్ విమెన్ గా మారి మలయాళంలో హీరోయిన్ గా ఎలిజబెత్ హరిణి చందన గుర్తింపు తెచ్చుకుంది.ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టిన ఎలిజబెత్ హరిణి తరువాత మలయాళీ నటుడు జయసూర్యకి జోడీగా ఒక సినిమాలో నటించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నటి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని భార్యగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది.ఎలిజబెత్‌ హరిని చందన కొంతకాలంగా తను గాఢంగా ప్రేమిస్తున్న సునీష్‌ను వేదమంత్రాల సాక్షిగా మనువాడారు.

కేరళలోని ఎర్నాకులమ్‌ బీటీహెచ్‌ హాల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది.ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

సెలబ్రిటీల మేకప్‌ ఆర్టిస్ట్‌, ట్రాన్స్‌జెండర్‌ రెంజు రెంజిమార్‌ వధువు తల్లి స్థానంలో నిలబడి పెళ్లి చేశారు.ఎలిజబెత్‌ను పెళ్లి కూతురిని చేసే దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు.

వీరి పెళ్లి ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తల్లిగా నా బాధ్యతలను పూర్తి చేశాను.నా చేతుల మీదుగా కూతురి పెళ్లి చేశాను.

ఇటువంటి భాగ్యాన్నిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు అని తెలిపారు.ఈమె పెళ్ళికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

.

#EqualGender #Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు