తన కలర్ పై కామెంట్ చేసిన నెటిజెన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన 'ఈషా'..! ఏమన్నారంటే.?   Actress Eesha Rebba Strong Counter To Netizens     2018-10-26   10:10:25  IST  Sainath G

చిన్న సినిమాలలో కథానాయికగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తోన్న ఈషా రెబ్బా, ‘అరవింద’ వంటి పెద్ద సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘అంతకు ముందు ఆ తర్వాత’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ఇటీవ‌ల‌ ‘అ’ చిత్రంలోను కనిపించింది . తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన‌ అరవింద సమేత చిత్రంలో కీలక పాత్ర పోషించింది .ఎన్టీఆర్ చెల్లెలిగా వైవిధ్య‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచి విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె సోషల్ మీడియాలో సరదాగా అభిమానులతో ముచ్చటించింది.

అయితే ఈ అమ్మ‌డిని ఓ నెటిజన్ ‘ఈషాగారు మీరు కొంచెం కలర్‌ ఉంటే మీకు తిరుగే ఉండేది కాదు’ అని కామెంట్‌ చేశారు.దానికి ఈషా ఎందుకండీ ఈ కలర్ పిచ్చి.. నాకున్న రంగుతో నేను సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Actress Eesha Rebba Strong Counter To Netizens-

ఈషాకి తెలుగులోనే కాదు వేరే భాష‌ల‌లోను ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. క‌న్న‌డ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ చిత్రంలో ఈషా రెబ్బా కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించనుందట. ఈ సినిమాకు లక్కీ గోపాల్ దర్శకుడు. కిరిక్ పార్టీ (కన్నడ)కి మ్యూజిక్ అందించిన అజనీష్ బీ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాడు.