మ్యాథ్స్ టీచ‌ర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్!

Actress Devoleena Bhattacharjee Reveals Her Maths Teacher Misbehaved With Her

టీవీ నటిగా, భరతనాట్యం డ్యాన్సర్ గా దేవలీనా భట్టచార్జీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.తాజాగా ఈ నటి లేడీస్ వర్సెస్ జెంటిల్ మేన్ సీజన్2 షోలో పాల్గొని తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

 Actress Devoleena Bhattacharjee Reveals Her Maths Teacher Misbehaved With Her-TeluguStop.com

బాల్యంలో మ్యాథ్స్ టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని దేవలీనా తెలిపారు.ఆ మ్యాథ్స్ టీచర్ మంచి టీచర్ గా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడని దేవలీనా చెప్పుకొచ్చారు.

చాలామంది స్టూడెంట్స్ ఆయన దగ్గర ట్యూషన్ కు వెళ్లేవారని దేవలీనా తెలిపారు.నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఆయన దగ్గర ట్యూషన్ కు వెళ్లేవారని దేవలీనా పేర్కొన్నారు.

 Actress Devoleena Bhattacharjee Reveals Her Maths Teacher Misbehaved With Her-మ్యాథ్స్ టీచ‌ర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఒక వారం తర్వాత తన స్నేహితులు ఆ ట్యూషన్ కు వెళ్లడం మానేశారని దేవలీనా చెప్పుకొచ్చారు.ఆ తర్వాత తాను ట్యూషన్ కు వెళ్లగా మ్యాథ్స్ టీచర్ తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించారని దేవలీనా కామెంట్లు చేశారు.

నేను అమ్మకు ఈ విషయం చెప్పగా మ్యాథ్స్ టీచర్ భార్యకు అమ్మ ఈ విషయం చెప్పిందని దేవలీనా అన్నారు.అయితే తాను ఆ టీచర్ పై గట్టి చర్యలు తీసుకోవాలని అనుకున్నానని దేవలీనా వెల్లడించారు.

ఆ సమయంలో తన ఫ్రెండ్స్ కూడా అదే కారణం వల్ల మానేసి ఉంటారని అనిపించిందని దేవలీనా అన్నారు.ఇతరులకు ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించి తన స్నేహితులు సైలెంట్ గా ఉండి ఉండవచ్చని తనకు అర్థమైందని దేవలీనా పేర్కొన్నారు.

Telugu Bigg Boss 15, Devaloena, Interesting Facts, Maths Teacher-Movie

నా ఫ్యామిలీ కూడా అదే విధంగా ఆలోచించిందని దేవలీనా అన్నారు.ఆ రీజన్ వల్లే తాను పోలీసుల దగ్గరకు వెళ్లలేదని దేవలీనా చెప్పుకొచ్చారు.పిల్లలు ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొంటే తగిన చర్యలను తీసుకోవాలని దేవలీనా కోరారు.దేవలీనా బిగ్ బాస్ సీజన్ 15లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఉన్నారు.

#Devaloena #Teacher #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube