నన్ను తిట్టుకోకండి.. ఆ గ్యాప్ లో లీక్ చేస్తా: దీప్తి సునైనా

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల మూవీ అప్డేట్ కోసం అభిమానులు బాగా ఎదురు చూస్తూ ఉంటారు.వారి దగ్గర నుంచి ఏదో ఒక మూవీ ఆశిస్తూనే ఉంటారు.

 Actress Deepthi Sunaina Shocking Post On Emone Video Going Viral Details, Deepti-TeluguStop.com

ఇక ఆ మూవీ గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి విడుదలయ్యే వరకు తమ అభిమాన సెలబ్రెటీని అస్సలు వదలరు.కొన్ని కొన్ని సార్లు అభిమానుల కోసం సెలబ్రెటీలు కూడా తమ సినిమా అప్డేట్లు అందిస్తూ ఉంటారు.

ఆ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఆలస్యం అవుతే ఇక అంతే సంగతి.తమ అభిమాన సెలబ్రెటీని విసిగించడం కాకుండా రచ్చ రచ్చ చేస్తుంటారు.దీంతో ముందుగానే ఆ సెలబ్రెటీ వారికి అప్డేట్ ఇస్తూ ఉంటారు.ఆలస్యమైనందుకు సారీ చెబుతూ ఉంటారు.

ఇప్పుడు అటువంటి పరిస్థితియే దీప్తి సునైనకు ఎదురయింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా మొత్తానికి ఒక సెలబ్రిటీ హోదాను మోస్తుంది.డబ్స్మాష్ వీడియోస్ ద్వారా  అందరి దృష్టిలో పడిన దీప్తికి మంచి క్రేజ్ వచ్చింది.

కేవలం రీల్స్ తోనే కాకుండా యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.పైగా రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టగా ఆమె క్రేజ్ మరింత ఎక్కువయ్యింది.

దీంతో బుల్లితెరపై కూడా తన పరిచయాన్ని పెంచుకుంది.

Telugu Actressdeepthi, Deepthisunaina, Deepti Sunaina, Emone-Movie

ఇక ఈమె వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.అదేంటంటే మరో యూట్యూబర్ షణ్ముఖ్ తో కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉండగా ఏడాది కిందట బ్రేకప్ చెప్పేసింది.అదేంటో అందరికీ తెలిసిందే.

షణ్ముఖ్ కూడా బిగ్ బాస్ లో పాల్గొనగా అక్కడ ఈయన మరో అమ్మాయితో చేసిన రచ్చ వల్ల దీప్తి వదిలేసుకుంది.వీరిద్దరి విడిపోయాక తమ అభిమానులు మాత్రం చాలా ఫీల్ అయ్యారు.

ఇప్పటికీ వీరిద్దరూ కలుస్తారేమో అన్న ఆశ అభిమానులకు ఉండగా.వారిద్దరి తీరు చూస్తే మాత్రం ఇక వారు కలవరు అన్నట్లుగా ఉంది.ఇక ఇద్దరు బ్రేకప్ తర్వాత ఎవరి దారి వాళ్లు అన్నట్లుగా ఎంచుకున్నారు.అక్కడ షన్ను తన ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.

ఇక్కడ దీప్తి కూడా తన ప్రాజెక్టుతో బాగా బిజీగా ఉంది.సోషల్ మీడియాలో కూడా ఎప్పటిలాగానే సందడి చేస్తుంది.

Telugu Actressdeepthi, Deepthisunaina, Deepti Sunaina, Emone-Movie

అయితే ఆమె తాజాగా ‘ఏమోనే’ అనే వీడియో చెయ్యగా దీని గురించి ఒక అప్డేట్ షేర్ చేసుకుంది.ఏమోనే వీడియో పండగ తర్వాత విడుదల చేస్తాము అని ప్రకటించింది.దీంతో తిట్టుకోవద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది.ఎందుకంటే ఈ వీడియో కోసం తన ఫాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు కాబట్టి.అయితే ఇటీవలే దీనిని విడుదల చేస్తాము అని ప్రకటించగా  ఇప్పుడు అది ఆలస్యం అవుతుంది అని అది కూడా జనవరి 18 న విడుదల చేస్తాము అని తెలిపింది.ఆ గ్యాప్ లో లీక్ చేస్తుంటాను అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube