సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది అభిమానులు ఉత్సాహ పడుతుంటారు.ఈ క్రమంలోనే వారి వ్యక్తిగత విషయానికి వస్తే కుటుంబ విషయాలు కానీ, వారి పుట్టిన రోజులు, వారి చిన్నప్పటి ఫోటోలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి చాలామంది కుతూహలం చూపిస్తుంటారు.
అలాగా సినీ తారల విషయాలను తెలుసుకోవాలనీ ఆరాటపడేవారికి ఒక చిన్న పజిల్ ఇక్కడ ఉండబోతోంది.ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలో ఎంతో అందంగా నవ్వులు కురిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.
ఇప్పుడు ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ బిజీగా ఉన్నారు.
ఇప్పటివరకు ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు.
తెలుగులో ఈమె ఎలాంటి సినిమాలు చేయక పోయినప్పటికీ తెలుగులో కూడా ఈమెకు వీరాభిమానులు ఉన్నారు.ఇన్ని క్లూస్ ఇచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్ట లేకపోతున్నారా.? అయితే మీకు మరొక క్లూ కూడా ఉంది.అదేంటంటే ఈ బ్యూటీ తన సహచర నటుడనే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇంత క్లూ ఇచ్చిన ఇప్పటికీ ఈ నటి ఎవరో గుర్తు రాలేదా.?.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమాలతో ఏ మాత్రం క్షణం తీరికలేకుండా గడుపుతున్న ఈ చిన్నారి త్వరలోనే నేరుగా తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి ఓ సినిమాలో రానుంది.పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ సరసన ఈ బ్యూటీ జోడి కట్టడానికి సిద్ధమయింది.ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తుపట్టారా? అదేనండి పాన్ ఇండియా చిత్రంగా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న హీరోయిన్ దీపికా పదుకొనే.చిన్నప్పుడు ఈ ఫోటోలలో ఎంతో ముద్దుముద్దుగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఈ హీరోయిన్ దీపికా పదుకొనే.
ప్రస్తుతం ఈబ్యూటీకి సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను పలువురు కొందరికి షేర్ చేస్తూ ఎవరో గుర్తుపట్టండి అంటూ వారి మెదడుకు పని పెడుతున్నారని చెప్పవచ్చు.