మోదీని రిక్వెస్ట్ చేసిన సుధాచంద్రన్.. ఎయిర్ పోర్ట్ లో ఇబ్బంది పెడుతున్నారంటూ?

ప్రముఖ నటిగా, డ్యాన్సర్ గా సుధాచంద్రన్ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.1981 సంవత్సరంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సుధాచంద్రన్ కాలును కోల్పోయారు.అయితే కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా సుధాచంద్రన్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.సుధాచంద్రన్ తెలుగులో మయూరి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

 Actress Dancer Sudha Chandran Request To Pm Narendra Modi, Narendra Modi , Sudha-TeluguStop.com

సుధాచంద్రన్ తెలుగులో సినిమాలతో పాటు అనేక సీరియళ్లలో కూడా అద్భుతంగా నటించి మెప్పించారు.తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సుధాచంద్రన్ ముంబైలోని కాలేజీలో బీఏ డిగ్రీని, ఎం.ఏ డిగ్రీని పూర్తి చేశారు.అయితే ఈ సీనియర్ నటి మోదీని ఒక విషయంలో రిక్స్వెస్ట్ చేసుకున్నారు.

ఎయిర్ పోర్ట్ లో అధికారుల వల్ల తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సుధాచంద్రన్ చెప్పుకొచ్చారు.తమకు ఒక స్పెషల్ కార్డ్ జారీ చేయాలంటూ సుధాచంద్రన్ ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేశారు.

Telugu Actress, Airport, Pm Modi, Problems, Sudhan Chandra-Movie

సుధాచంద్రన్ ప్రధాని మోదీని ట్యాగ్ చేయడం గమనార్హం.చెకింగ్ కోసమని అధికారులు కృత్రిమ పాదాన్ని తొలగించాలని కోరుతున్నారని అధికారుల వల్ల తనకు ఇబ్బంది ఎదురవుతోందని ఆమె అన్నారు.అధికారులకు తన పరిస్థితిని వివరించి చెప్పినా వాళ్లు అర్థం చేసుకోవడం లేదని ఆమె కామెంట్లు చేశారు.కృత్రిమ కాలుతో డ్యాన్స్ చేసిన తాను ఈ దేశం గురించి గర్వపడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Actress, Airport, Pm Modi, Problems, Sudhan Chandra-Movie

తాను కృత్రిమ అవయవం కొరకు ఎక్స్ ప్లోసివ్‌ ట్రేస్‌ డిటెక్టీవ్‌ చేయాలని కోరుతున్నానని కానీ సిబ్బంది మాత్రం తన అభ్యర్థనను పట్టించుకోవడం లేదని సుధాచంద్రన్ పేర్కొన్నారు.ఒక మహిళ మరో మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆమె ప్రశ్నించారు.సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ అని చెప్పే కార్డును ఇవ్వాలని ఆమె కోరారు.సుధాచంద్రన్ అభ్యర్థన విషయంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube