'కలర్స్' పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

స్వాతి అంటే మనం అంత సులభంగా గుర్తు పట్టలేమేమో కానీ కలర్స్ స్వాతి అంటే మాత్రం చలాకీగా, అల్లరి చేస్తూ కనిపించే స్వాతి ఠక్కున గుర్తొచ్చేస్తుంది.చేసింది తక్కువ సినిమాలే అయినా తన పాత్రల ద్వారా స్వాతి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

 Actress Colors Swathi Re Entry In Tollywood , Colors Swathi, Marriage, Webseries-TeluguStop.com

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావని, అవకాశాలు వచ్చినా సక్సెస్ కారనే విమర్శలు ఉన్నాయి.

అయితే స్వాతి మాత్రం తన టాలెంట్ తో విజయాలు అందుకుని ఆ విమర్శలు నిజం కాదని ప్రూవ్ అయ్యేలా చేసింది.

కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఈ తెలుగమ్మాయి తాజాగా మళ్లీ టాలీవుడ్ సినిమాల్లో తన దూకుడు చూపించాలని భావిస్తోంది.మా టీవీలో ప్రసారమైన కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ కలర్స్ పాప ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Actresscolors, Colors Swathi, Swathi, Tollywood-Movie

ల్యాంగ్ గ్యాప్ తరువాత సినిమాల్లో కూడా నటించాలని భావిస్తున్న స్వాతి అందుకోసం తన లుక్ ను కూడా మార్చుకుందని తెలుస్తోంది.పైలెట్ వికాస్ వాసును పెళ్లి చేసుకొన్న స్వాతి తన భర్తతో విడాకులు తీసుకుందని కొన్ని నెలల క్రితం వార్తలు రాగా ఆ వార్తలను స్వాతి ఖండించింది.భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో విడాకుల గురించి వార్తలు రాగా ఫోటోలను ఆర్చివ్ చేశానని ఆమె వివరణ ఇచ్చింది.మరి రీఎంట్రీలో స్వాతి ఎలాంటి పాత్రలను ఎంచుకుంటుందో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube