అందులో వేలు పెట్టిన చార్మి

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పలు సక్సెస్‌ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ చార్మి.ఈ అమ్మడు ప్రస్తుతం అంతగా ఆఫర్లు తెచ్చుకోవడంలో విఫలం అవుతోంది.

 Charmi To Produce Jyothi Lakshmi Movie-TeluguStop.com

గత కొంత కాలంగా చేసిన ప్రతీ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో ఆఫర్లు రాకుండా అయ్యాయి.అయితే తాజాగా ఈమెకు పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో నటించే బంపర్‌ ఆఫర్‌ వచ్చింది.

ఆఫర్లు లేని ఈ సమయంలో ఈ అమ్మడికి ఉన్నట్లుండి ఇంత పెద్ద ఆఫర్‌ రావడంతో అంతా షాక్‌ అయ్యారు.అయితే దీని వెనుక ఒక కారణం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌కు చార్మికు సన్నిహిత సంబంధాలున్నాయి.వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో సినిమాలు కూడా వచ్చాయి.

దాంతో తన కెరీర్‌లో ఒక్క సక్సెస్‌ ఇవ్వమంటూ పూరిని చార్మి వేడుకున్నట్లుగా తెలుస్తోంది.అందుకు పూరి ఓకే చెప్పాడు.

పూరి ఓకే చెప్పినా కూడా వీరి కాంబినేషన్‌లో సినిమాను చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపలేదు.దాంతో నిర్మాణంలో కూడా ఈ అమ్మడు వేలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

అనధికారికంగా ఈ సినిమాకు నిర్మాతగా చార్మి వ్యవహరిస్తుందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.మరి ఈ అమ్మడు నిర్మాతగా సక్సెస్‌ అవుతుందా, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న చార్మి మరింత కష్టాలను కొని తెచ్చుకుంటుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube