ఛార్మి తల్లిదండ్రులకు కరోనా .. మనసు ముక్కలైందంటూ భావోద్వేగ పోస్ట్..!

భారత్ లో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది.ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

 Actress Charmi Kaur Parents Tested Corona Positive, Actress Charmi Kaur , Charmy-TeluguStop.com

తాజాగా ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి కౌర్ తల్లిదండ్రులకు కరోనా సోకింది.ఈ నెల 22వ తేదీన వాళ్లకు కరోనా నిర్ధారణ అయింది.

తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఛార్మి కౌర్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు.తన మనస్సు ముక్కలైందంటూ ఛార్మి భావోద్వేగ సందేశం ఇచ్చారు.

ఛార్మి తన పోస్ట్ లో మార్చి నెల చివరి వారం నుంచి తన తల్లిదండ్రులు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని.అయితే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చిన సమయంలో తల్లిదండ్రులకు కరోనా సోకి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో తల్లిదండ్రులిద్దరూ చికిత్స పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు.తన తండ్రి హెల్త్ హిస్టరీ వల్ల కరోనా సోకిందనే వార్త తెలిసి తన మనస్సు ముక్కలైందని పేర్కొన్నారు.

ప్రస్తుతం తన తల్లిదండ్రులు తనకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న నాగేశ్వర రెడ్డి అనే వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని అన్నారు.నాగేశ్వర రెడ్డి, ఆయన బృందం తన తల్లిదండ్రులు త్వరగా కోలుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారని.

ఏఐజీ ఆస్పత్రి వైద్యులకు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు.

ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని.

త్వరగా కరోనాను గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చని.ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని పేర్కొన్నారు.

దుర్గామాత ఆశీస్సులతో పాటు మీ ఆశీర్వాదం తన తల్లిదండ్రులకు కావాలని అన్నారు.ప్రతి ఒక్కరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

ఛార్మి తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube