ఆ టాలీవుడ్ హీరోయిన్ కూతురు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

అలానాటి హీరోయిన్ల‌లో మ‌న‌కు అందం, సౌమ్యం అంటే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది హీరోయిన్ చంద్ర‌క‌ళ.చెన్నైకి చెందిన చంద్ర‌క‌ళ చిన్న వ‌య‌స్సులోనే స్టార్ హీరోయిన్ గా స్టార్ డ‌మ్ సంపాదించుకుంది.1961లో హిందీ, 1963లో క‌న్న‌డ , తెలుగు, 1971 కోలీవుడ్ వెండితెర‌పై క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా ప్రేక్షకాభిమ‌నాల్ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా టాలీవుడ్ లో బాపు డైర‌క్ష‌న్ లో 1971లో శోభ‌న్ బాబు హీరోగా, చంద్ర‌క‌ళ హీరోయిన్ లుగా సంపూర్ణ రామాయ‌ణం సినిమా తెర‌కెక్కింది.

 Actress Chandrakala Daughter, Senior Heroine, Reshma, Sampurna Ramayanam, Bala R-TeluguStop.com

ఈ సినిమాలో రాముడి పాత్ర‌లో శోభ‌న్ బాబు, సీతమ్మ పాత్రలో చంద్ర‌క‌ళలు అభిమానుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేశారు.

నాటి నుంచి మొద‌లైన చంద్ర‌క‌ళ హ‌వా నిర్విరామంగా కొన‌సాగింది.

తెలుగులో అల‌నాటి అగ్ర‌హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్ ఆర్, శోభ‌న్ బాబు, సూప‌ర్ స్టార్ కృష్ణ‌, రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు స‌ర‌స‌న తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చంద్రకళ 48 ఏళ్ల వ‌య‌స్సులో క్యాన్స‌ర్ తో మ‌ర‌ణించారు.ఇప్పుడు ఆమె కూమార్తె రేష్మఘ‌టాల టాలీవుడ్ లో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదిస్తున్నారు.

Telugu Reshma, Senior-Movie

మాస్ క‌మ్యూనికేష‌న్ జ‌ర్న‌లిజం కంప్లీట్ చేసిన రేష్మ.రైట‌ర్ గా త‌న కెరియ‌ర్ ను ప్రారంభించారు.ఓ వైపు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌కు జ‌ర్న‌ల్స్ రాస్తూ.మ‌రోవైపు సినిమా కథ‌ల్ని రాశారు.2009లో ఓ డైర‌క్ట‌ర్., త‌న‌కు సినిమా చేయాల‌ని, మీ ద‌గ్గ‌ర స్టోరీ ఏమైనా ఉంద‌ని రేష్మ‌ని అడిగార‌ట‌.

అప్పుడే త‌న ద‌గ్గ‌ర ప్రేమ క‌థ‌లు ఉన్నాయని చెప్ప‌డంతో వారం రోజులు టైమ్ లో 200 పేజీల ల‌వ్ స్టోరీని త‌యారు చేసి.స‌ద‌రు డైర‌క్ట‌ర్ కి ఇవ్వ‌డంతో ఆ స్టోరీ తో సినిమా తెర‌కెక్కిన‌ట్లు చెబుతోంది రేష్మ‌.

ఆ సినిమాలో డైలాగ్స్ కూడా రాసింది రేష్మ‌నే.ఆ సినిమాయే నానీ, సమంత హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం ఎటోవెళ్లి పోయింది మ‌న‌సు.ఆ సినిమా స్టోరీ రైట‌రే కాదు.స‌హ‌నిర్మాత‌గా మారింది ర‌ష్మీ.అలా మొద‌లైన ర‌ష్మి సినిమా కెరియ‌ర్ రోబో, ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు, ఆరెంజ్, ద‌డ తో పాటు 60 సినిమాల‌కు ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టింది.గౌత‌మ్ మీన‌న్ తో క‌లిసి సినిమా ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేసిన ర‌ష్మీ.

ఇప్ప‌టి వ‌ర‌కు 9సినిమాల‌కు ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube