రాధేశ్యామ్ లో పాత్ర లీక్ చేసిన సీనియర్ నటి.. ఏం జరిగిందంటే?

సల్మాన్ ఖాన్ హీరోగా మైనే ప్యార్ కియా సినిమాలో బాలీవుడ్‌కు పరిచయమైన నటి భాగ్యశ్రీ. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎక్కువ కాలం కొనసాగలేదు.

 Actress Bhagyashree Talks About Her Role Radhe Shyam-TeluguStop.com

ఈమె తన కెరియర్ గురించి కాకుండా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ఇలా ఇండస్ట్రీకి దూరమైన మూడు దశాబ్దాల తర్వాత తిరిగి ఈ హీరోయిన్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం రాధే శ్యామ్.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.అయితే ఈ సినిమాలో నటించినటువంటి సీనియర్ నటి భాగ్యశ్రీ తన పాత్ర గురించి బయట పెట్టేసారు.ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన ఈమె ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తున్నానని ఈ పాత్ర సినిమాలో ఎంతో కీలకమైనదని, ఇకపై ఈ విధమైనటువంటి పాత్రలనే ఎంపిక చేసుకుంటానని ఈ సందర్భంగా వెల్లడించారు.

 Actress Bhagyashree Talks About Her Role Radhe Shyam-రాధేశ్యామ్ లో పాత్ర లీక్ చేసిన సీనియర్ నటి.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu About Her Role, Bhagyashree, Bollywood, Prabhas, Radhe Shyam, Tollywood-Movie

ప్రభాస్ తల్లి పాత్ర సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉంటుందని, ఇంతటి అద్భుతమైన సినిమాను బుల్లితెరపై కన్నా వెండి తెరపై చూస్తేనే ఆ ఫీల్ బాగుంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించిన సంగతి మనకు తెలిసిందే.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించారు.

#Bhagyashree #Role #Prabhas #Radhe Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు