నా పేరు పచ్చబొట్టు ఉన్న వ్యక్తిని ప్రేమిస్తున్న: అషు రెడ్డి

బిగ్ బాస్ సీజన్ 3 తో ప్రేక్షకులకు మరింత పరిచయమైన సెలబ్రిటీ అషు రెడ్డి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తన అల్లర్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Ashu Reddy Shared A Video On Instagram With Mothers Tattoo, Ashu Reddy, Comedia-TeluguStop.com

బిగ్ బాస్ ముందు ఈమె పరిచయం చాలా తక్కువ.సోషల్ మీడియా వేదికగా డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ డాన్సులు, డైలాగులతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి.

చూడటానికి సమంతలా కనిపించడంతో ఇక అప్పటి నుండి జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది.

అంతేకాకుండా వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో అవకాశాన్ని అందుకుంది.

ఆ తర్వాతనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.మంచి సెలబ్రిటీ హోదాను అందుకుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత పలు అవకాశాలు అందుకుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ఆమె పవన్ కళ్యాణ్ పై చూపించే అభిమానం మాత్రం మాటల్లో చెప్పలేనిది.ఏకంగా ఆయన పేరునే టాటూ వేయించుకుంది ఈ బ్యూటీ.

ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో సన్నిహితంగా ఉండేసరికి వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు పైగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఏం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే బుల్లితెరలో స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం లో కూడా చేస్తుంది.

ఇక ఇందులో మరో కమెడియన్ హరితో కలిసి చేసే స్కిట్ లు మాత్రం అంతా ఇంతా కాదు.అతనితో బాగా రెచ్చిపోతూ హద్దులు దాటుతుంది.ఇక ఇతడితో కూడా ప్రేమలో ఉన్నట్లు బాగా వార్తలు వినిపించాయి.

కానీ షో కోసం మాత్రమే అలా సన్నిహితంగా ఉంటామని చెప్పుకొచ్చింది అషు.

ఇక ఇటీవలే ఈ షోలో హరి.అషును ప్రపోజ్ చేసిన సీన్ వైరల్ గా మారింది.తన గుండెలపై ఆమె పేరును పచ్చబొట్టు కొట్టించుకున్నట్లు చూపించగా ఆమె లాగి పెట్టి అతని కొట్టింది.అంతేకాకుండా ఇది పర్మినెంట్ టాటూ అని చెప్పడంతో షాక్ అవగా మళ్లీ వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.దీంతో ఈ ప్రశ్నలకు ఒక వీడియోతో సమాధానమిచ్చింది అషు.

తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకోగా అందులో తన తల్లి చేతిపై ఉన్న తన పేరు టాటూను చూపించింది.అంతేకాకుండా తన పేరు నిజంగా టాటూ ఉన్న వ్యక్తి తన తల్లి ఒక్కరే అని స్పష్టం చేసింది.తాను ప్రపంచంలో హద్దులు లేకుండా ప్రేమించేది ఆమె ఒక్కతే అంటూ.తను కూడా తన తల్లిని ఎంతో ప్రేమిస్తున్నట్లు తెలిపింది.ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే యాంకర్ రవి తో కలిసి మరో షోలో యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube