ఆ విషయంలో నేను వరెస్ట్.. సీక్రెట్ చెప్పేసిన అషురెడ్డి..?

టిక్ టాక్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి ఆ వీడియోల కంటే బిగ్ బాస్ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.ఈ మధ్య కాలంలో కామెడీ స్టార్స్ షో ద్వారా అషురెడ్డి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

 Actress Ashu Reddy Interesting Comments About Cooking Ashu Reddy,  Cooking , Exp-TeluguStop.com

ఎక్స్ ప్రెస్ హరితో కలిసి అషురెడ్డి చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.మరోవైపు సోషల్ మీడియాలో అషురెడ్డి యాక్టివ్ గా ఉంటున్నారు.

తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అషురెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు.అషురెడ్డి పోస్టులను కొన్నిసార్లు నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా అషురెడ్డి వంట పని చేసే విషయంలో తాను వరస్ట్ అని వెల్లడించారు.దోసలు వేయడానికి అషురెడ్డి ఎంతో కష్టపడ్డారు.

అయితే ఎంతో కష్టపడినా ఆమె వేసిన దోసెలు బాగా రాలేదు.మరోవైపు రాత్రిపూత ఆమె పేకాట ఆడగా ఆ ఆట కూడా ఓడిపోయినట్టు తెలిపారు.

వరస్ట్ గేమ్ అంటూ అషురెడ్డి పేకాట గురించి కామెంట్ చేశారు.మరోవైపు ఎక్స్ ప్రెస్ హరితో లవ్ ట్రాక్ ద్వారా అషురెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఆఫ్ స్క్రీన్ లో ఎక్స్ ప్రెస్ హరిని అన్నయ్య అని పిలుస్తున్న అషురెడ్డి ఆన్ స్క్రీన్ లో మాత్రం రెచ్చిపోతూ వార్తలో నిలుస్తున్నారు.ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి జోడీగా ఇతర బుల్లితెర జోడీలలాగా మంచి పేరును సంపాదించుకోవడం గమనార్హం.

Telugu Ashu Reddy, Express Hari-Movie

తాజాగా రిలీజైన ప్రోమోలో అషురెడ్డి ఇష్టం ఉన్న సమయంలో పక్కన లేకపోతే బాధగా ఉంటుందని తనకు తెలుసని గుండెలో ప్రేమలో లేకపోతే మాత్రం కన్నీళ్లు వస్తాయంటూ అషురెడ్డి చెప్పగా శేఖర్ మాస్టర్ నువ్వు రాలేదని హరి ఎంతో బాధ పడ్డాడంటూ చెప్పుకొచ్చారు.కామెడీ స్టార్స్ ఎపిసోడ్ ఈరోజు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube