నా భార్యలో నచ్చింది అదే.. ప్రముఖ నటి అర్చన భర్త కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన అర్చన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా అలీతో సరదాగా షోకు అర్చన తన భర్తతో కలిసి హాజరయ్యారు.

 Actress Archana Husband Jagadeesh Comments Goes Viral In Social Media Archana, Husband Jagadeesh, Ali Tho Saradaga, Tollywood, Nuvvostanante Nenoddantana-TeluguStop.com

అర్చన మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చిందని పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నారు.అందరిలా నేను కూడా పెళ్లి అంటే భయపడ్డానని ఆమె వెల్లడించారు.

జగదీశ్ ను మొదట కలిసిన సమయంలో ఆయన మౌనంగా ఉన్నారని అర్చన చెప్పుకొచ్చారు.

 Actress Archana Husband Jagadeesh Comments Goes Viral In Social Media Archana, Husband Jagadeesh, Ali Tho Saradaga, Tollywood, Nuvvostanante Nenoddantana-నా భార్యలో నచ్చింది అదే.. ప్రముఖ నటి అర్చన భర్త కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి ఒప్పించామని అర్చన చెప్పుకొచ్చారు.

నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగానని హైదరాబాద్ లోనే నా చదువు పూర్తైందని ఆమె కామెంట్లు చేశారు.జగదీష్ మాట్లాడుతూ తనది చెన్నై అని నాన్న రిటైల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పుకొచ్చారు.

అర్చనలో నాకు నచ్చేది సింప్లిసిటీ అని జగదీష్ చెప్పుకొచ్చారు.తను నటి అనే భావనను ఎప్పుడూ చూపించదని జగదీష్ వెల్లడించారు.

అర్చన సరదాగా, నిజాయితీగా ఉంటుందని గృహిణిగా అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుందని జగదీష్ కామెంట్లు చేశారు.అర్చన స్క్రీన్ పై కనిపించాలని నూటికి నూరు శాతం కోరుకుంటున్నానని జగదీష్ తెలిపారు.

అర్చనతో పెళ్లి సమయంలో ఆశీర్వాదంతో పాటు హెచ్చరికలు వచ్చాయని జగదీష్ కామెంట్లు చేశారు.రాఘవేంద్ర రావు గారు మా సీతమ్మను బాగా చూసుకోవాలని అన్నారని ఆయన తెలిపారు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ లా చేయడంతో బాపు సినిమాలో ఛాన్స్ కోల్పోయానని అర్చన అన్నారు.మగధీర మూవీలో సలోని రోల్ కోసం నన్ను సంప్రదించారని ఆమె తెలిపారు.ఆ సినిమాలో నటించి ఉంటే మర్యాద రామన్న సినిమాలో ఛాన్స్ దక్కి ఉండేదేమోనని అర్చన పేర్కొన్నారు.అర్చన చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube