తెలుగు వారని నమ్మి వెళ్తే...ఆ రోజు రాత్రి నా చేయి పట్టుకొని లాగాడు - హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు       2018-06-21   03:19:37  IST  Raghu V

తెలుగు చిత్రసీమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇంకా సద్దుమణగముందే.. చికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. అమెరికాలో తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్, చంద్రకళ నడిపిస్తున్న వ్యభిచారం ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి కలవరపాటుకి గురైంది. సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఆ చీకటి బాగోతంతో సంబంధం ఉన్న తారలతో పాటు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన వారు కూడా హడలిపోతున్నారు.

ఈ విష‌యంపైనే ఒక ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో ప్ర‌ముఖ న‌టి అర్చ‌న పాల్గొని అమెరికాలో త‌న‌కు ఎదురైన ఒక చేదు అనుభ‌వాన్ని చెప్పుకొచ్చింది. గ‌త సంవ‌త్స‌రం తెలుగు సంఘాల వారు నిర్వ‌హించిన ఒక కార్య‌క్రమంలో పాల్గొనాలంటూ త‌న‌కు ఆహ్వానం అందింద‌ని, మ‌న తెలుగువారే క‌దా..! అనే ఆలోచ‌న‌తో, ఆహ్వానం అంద‌డంతో చికాగో వెళ్లిన‌ట్టు తెలిపింది. కార్య‌క్ర‌మంలో భాగంగా వ‌చ్చిన అతిధులంద‌రికీ ఒక ఫైవ్ స్టార్ హోట‌ల్లో రూములు బుక్ చేశార‌ని, వారిలో తాను కూడా ఉన్న‌ట్టు అర్చ‌న తెలిపింది.

కార్య‌క్ర‌మాలు ముగిసిన రోజున అర్థ‌రాత్రి తెలుగు సంఘాల‌కు చెందిన ఒక మేనేజ‌ర్ త‌న గ‌దికి కాలింగ్ బెల్ నొక్కాడ‌ని, డోర్ తీయ‌డంతో లోప‌లికి వ‌చ్చేశాడ‌ని చెప్పింది. పూర్తి పేమెంట్ ఇచ్చేందుకు వ‌చ్చాను మేడ‌మ్‌.. ఇంకా ఏమ‌న్నా పేమెంట్ కావాలంటే చెప్పండి మేడ‌మ్ అని అడ‌గ‌సాగాడ‌ని, ఆ వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న‌ను గ‌మ‌నించిన వెంట‌నే త‌న‌ను రూము నుంచి బ‌య‌ట‌కు గెంటేశాన‌ని అర్చ‌న చెప్పింది. అయినా ఆ వ్య‌క్తి త‌న చేయిప‌ట్టుకుని ఏదో క‌క్ష‌క‌ట్టిన‌ట్టుగా లాగాడ‌ని, వెంట‌నే ప్ర‌తిఘ‌టించ‌డంతో ఆ మేనేజ‌ర్ త‌న రూమును వ‌దిలి వెళ్లిపోయాడ‌ని తెలిపింది.