ఇండస్ట్రీలో జరిగిన అవమానాల గురించి చెప్పిన అర్చన.. టీవీలో వేయలేదంటూ?

తెలుగు, తమిళ సినిమాలలో నటిగా అర్చన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.తమిళంలో ఒక సినిమాలో మంచి పాత్ర చేశానని హాంగ్ కాంగ్ లో షూటింగ్ జరిగిందని సాంగ్ కూడా షూట్ చేశారని అర్చన అన్నారు.

 Actress Archana Comments About Industry Situations,archana , Tollywood , Intrest-TeluguStop.com

ఆ సినిమా నిర్మాత సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి రాలేదని బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చారని అర్చన చెప్పుకొచ్చారు.ఆ నిర్మాత ఉద్దేశమే కరెక్ట్ కాదని అర్చన పేర్కొన్నారు.

ఆ నిర్మాత మాటలను తాను పట్టించుకోలేదని అయితే డైరెక్టర్ తన పాత్రను అందంగా రాశారని అయితే సినిమా రిలీజ్ కు ముందు తన పాత్రను మొత్తం తీసేశారని తెలిసిందని అర్చన అన్నారు.ఒక ఫండ్ రైజర్ ఈవెంట్ కు అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లగా అక్కడ మేనేజర్ సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడంతో నేను చేస్తానని ఒక అమ్మాయి ఎదురుచూస్తుందని ఆ అమ్మాయి చేస్తుందని తాను భావించానని అర్చన తెలిపారు.

Telugu Actress Archana, Tollywood-Movie

చివరకు తాను స్టేజ్ పైకి వెళ్లానని అయితే ఇండస్ట్రీలోని పెద్దవ్యక్తి ఒకరు అందరి ముందు గట్టిగా అరిచారని అర్చన పేర్కొన్నారు.నా సెల్ఫ్ రెస్పెక్ట్ ను ఆయన హర్ట్ చేశారని అర్చన వెల్లడించారు.తెలీకుండా కొన్ని జరిగిపోతాయని అవి మనకు నేర్పిస్తాయని అర్చన అన్నారు.ఇలాంటి వాళ్లు ఉన్నారని అమ్మకు తన సమస్యలను చెప్పుకుంటానని అర్చన పేర్కొన్నారు.అక్కడి డ్యాన్సర్లకు కూడా తన తప్పు లేదని అర్చన తెలిపారు.

Telugu Actress Archana, Tollywood-Movie

అయితే ఆ డ్యాన్స్ పర్ఫామెన్స్ టీవీలో వేయలేదని అర్చన కామెంట్లు చేశారు.ఇండస్ట్రీలో ఎంత పెద్ద యాక్టర్ అయినా ఇలాంటి ఘటనలు జరిగి ఉంటాయని అర్చన పేర్కొన్నారు.అర్చన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

అయితే అవమానించిన వ్యక్తుల గురించి మాత్రం అర్చన వెల్లడించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube