తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు సౌత్ ఇండియాలో ఎక్కువగా కలర్ డార్క్ ఉన్న హీరోయిన్స్ ఇప్పటికి కనిపిస్తూ ఉంటారు.నాటి నుంచి నేటి వరకు డల్ కలర్ ఉన్న హీరోయిన్స్ ని మన ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది.
నిజానికి గ్లామర్ ఫీల్డ్ అంటారు కాబట్టి హీరోయిన్స్ చాలా అందంగా ఉండాలి, కలర్ కూడా బాగుండాలి అని అనుకుంటారు.అదే నిజమని భ్రమపడతారు.
కానీ తెల్లగా ఉన్న అమ్మాయిని మరింత తెల్లగా చూపించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి.నల్లగా ఉన్న హీరోయిన్ ని అందంగా చూపించినప్పుడే కదా ఒక కెమెరామెన్ పనితనం కనిపించేది.
ఈ విషయంపై ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ, తెలుగు సినిమాల్లో ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయిన అర్చన( Actress Archana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.నా ఒంటి రంగు నలుపు దానిని చూసి నేను గర్వపడుతున్నాను.మన ఇండియన్ స్కిన్ కలర్ నలుపు అన్న విషయాన్ని అందరూ గుర్తించాలి.మనలో తెల్లగా ఉన్న వారు ఎవరు కూడా మన లాగా అందంగా ఉండరు.తెలుపు రంగు కేవలం ఉంది అనుకొని దాన్నే అందం అనుకుని భ్రమ పడుతున్నారు.కానీ ఇండియన్ స్కిన్ కలర్( Indian Skin Colour ) చాలా అందంగా ఉంటుందని దాన్ని మించిన రంగు మరొకటి ఏ ప్రపంచంలో లేదు అంటూ చెప్పకచ్చారు.
నటన బాగా వచ్చి ఉండాలి కానీ రంగు ఏది అనీ చూసే పరిశ్రమలో మనం ఉన్నందుకు బాధపడుతున్నాం అంటూ తెలిపారు.
తన అదృష్టం కొద్దీ బాలచందర్( Balachander ) ఎక్కువగా రంగు కన్నా కూడా అందమైన ముఖ కవలికలు ఉన్న హీరోయిన్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేశారు.కాబట్టి నాలాంటి చాలామంది ఇండస్ట్రీకి వచ్చారని, అందువల్లే గొప్ప చిత్రాలు కూడా వచ్చాయంటూ తెలుపుతున్నారు ఈ నేషనల్ అవార్డు విన్నర్.చరిత్రలో గొప్ప నటీమణులంతా కూడా రంగు తక్కువగా ఉన్నవారు అని గుర్తించాలంటూ తెలుపుతున్నారు.
నా రంగు చూసి ఏ రోజు నాకు అవకాశం ఇవ్వకూడదు అనుకున్న వారు లేరు అని కేవలం నా నటనతోనే అందర్నీ మెప్పించాను అంటూ చెప్పుకొచ్చారు అర్చన.