శ్రీదేవి, భూమిక కూడా ఇండస్ట్రీ కొత్తలో అలా చేసినవారే: నటి అపూర్వ

సినీ ఇండస్ట్రీకి పట్టిన అతిపెద్ద భూతం కాస్టింగ్ కౌచ్.తమ తమ సినిమాల్లో అవకాశం ఇస్తాం.

 Actress Apoorva Talking About Sridevibhumika-TeluguStop.com

కానీ మాకేంటి? అంటూ మహిళలను డైరెక్టుగా అడిగే బ్యాచులు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయంటూ ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ ఓపెన్‌గా చెప్పేశారు.

తెలుగు పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్‌లో ఎక్కువగా కమిట్‌మెంట్లు జరగడం, ఆఫర్‌ చేయడం జరుగుతూ ఉంటాయని ఎక్కడో ఒక దగ్గర వింటూనే ఉంటాం.

 Actress Apoorva Talking About Sridevibhumika-శ్రీదేవి, భూమిక కూడా ఇండస్ట్రీ కొత్తలో అలా చేసినవారే: నటి అపూర్వ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ నిజానికి అలా జరుగుతుందా ? ఆ మాట నిజమేనా అన్న ప్రశ్నకు నటి అపూర్వ ఈ విధంగా సమాధానమిచ్చారు.

ఒక ఆఫర్ మనకు బలంగా కావాలి అంటే అది టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఒకటే.

కొన్నిసార్లు కమిట్‌మెంట్ తీసుకున్నా ఆఫర్లు ఇవ్వడం అనేది జరగదు.అలా అయినపుడు రెండో సారి ఆ తప్పు చేయకూడదని అపూర్వ తెలిపారు.

ఇక్కడ ఏ సినీ పరిశ్రమ అనేది కాదు.కమిట్‌మెంట్ అనేది ఇద్దరు మనుషుల మధ్య అండర్‌స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది.

ఆ వ్యక్తి నిజంగా అవకాశం ఇస్తారు.ఆఫర్ ఇస్తారు అని నమ్మకం ఉంటేనే కమిట్‌మెంట్‌కి సిద్ధపడాలని ఆమె చెప్పుకొచ్చారు.

కానీ కొందరు ఇలాంటి కమిట్‌మెంట్లు ఏమీ లేకుండానే స్టార్‌డం వచ్చిన హీరోయిన్స్ కూడా ఉన్నారని అపూర్వ అన్నారు.తాను చూసింతవరకూ కొంత మంది హీరోయిన్స్‌కి ఫస్ట్ సినిమాతోనే మంచి కెరీర్ ఏర్పడిందని ఆమె తెలిపారు.

నిత్య మీనన్, శ్రీదేవి, భూమిక లాంటి వాళ్లు అలాంటి కోవకు చెందుతారని అపూర్వ వ్యాఖ్యానించారు.అంతే కాకుండా మనకు హిట్‌ వచ్చే వరకు మనం ఇండస్ట్రీ చుట్టూ తిరగాలి.

ఒక్కసారి మనకు హిట్ వచ్చిందంటే చాలు ఇండస్ట్రీ మన చుట్టూ తిరుగుతుందని ఆమె అన్నారు.

Telugu Actress Apoorva, Bhumika, Sridevi, Tollywood-Movie

ఒకప్పుడు ప్రముఖ నటి శ్రీదేవీ ఆమె కెరీర్ ప్రారంభంలో అవకాశాల్లేక ఇబ్బందులు పడి ఉండొచ్చు.ఆమెకు ఒక్కసారి హిట్ వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది.ప్రొడ్యూసర్స్ రూ.10లక్షలు పట్టుకొని ఆమె ఇంటి ముందు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని నటి అపూర్వ తెలిపారు.కాబట్టి ఒక్కసారి ఫేం అయ్యాక ఎలాంటి ఇష్యూస్ ఉండవని ఆమె స్పష్టం చేశారు.

తాను కూడా ఈ 18 ఏళ్లలో రెండు సార్లు అలాంటి సందర్భాన్ని ఫేస్ చేశానని ఆమె అన్నారు.అక్కడ బలవంతం ఏమీ ఉండదు.కాకపోతే కొన్నిసార్లు మనకు అవకాశాలు రాకపోవచ్చు.లేదా అప్పటికే మనం చేస్తున్న సినిమా నుంచి తీసివేయొచ్చు.

తనకు కూడా అలాంటి అనుభవం జరిగిందని, అలాగే ఒక సినిమా నుంచి తీసివేశారని అపూర్వ తెలిపారు.

#Actress Apoorva #Sridevi #Bhumika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు