అనుపమకు అలాంటి పనులు అసలు నచ్చవంట!  

actress anupama parameshwaran does not like such things at all,anupama parameshwaran, premam, shatamanam Bhavati,anupama parameshwaran Latest telugu news - Telugu Anupama Parameshwaran, Anupama Parameshwaran Latest Telugu News, Malayalam Heroine, Premam, Shatamanam Bhavati

2015 సంవత్సరంలో మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో నటించి సౌత్ ఇండియా అంతటా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్.త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో అనుపమ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

TeluguStop.com - Actress Anupama Parameshwaran Does Not Like Such Things At All

అనుపమ తొలి సినిమా నుంచి గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత పాత్రల్లోనే నటిస్తోంది.

అనుపమ తెలుగులో నటించిన ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు హిట్ కావడంతో ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుందని అందరూ భావించారు.

TeluguStop.com - అనుపమకు అలాంటి పనులు అసలు నచ్చవంట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆ తరువాత అనుపమ నటించిన సినిమాలు ఫ్లాపులు కావడంతో ఆమె కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుపమ తన గురించి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడించారు.

తనకు కుటుంబంలో అందరి కంటే తమ్ముడు అంటే ఎంతో ఇష్టమని.ఏ విషయంలోనైనా తన తమ్ముడి సహకారాలు ఎప్పుడూ ఉంటాయని.

లాక్ డౌన్ సమయంలో తమ్ముడితో కలిసి కేరళలోని జలపాతాలను, హిల్ స్టేషన్స్ ను చూశానని ఆమె అన్నారు.

తనకు మొహమాటం తక్కువని, కోపం ఎక్కువని మనసులో ఏ ఫీలింగ్ ఉన్నా వెంటనే అవతలి వ్యక్తులకు చెప్పేస్తానని.

తానో పెద్ద వాగుడికాయనని అందరూ అంటూ ఉంటారని తెలిపారు.తనకు మీడియాలో పని చేయడం అంటే ఎంతో ఇష్టమని.సినిమాలో అవకాశాలు రాకపోతే మీడియాలో పని చేసేదానినని అనుపమ చెప్పుకొచ్చారు.రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనేదే తన కోరిక అని అనుపమ వెల్లడించారు.

తన జుట్టు చాలా పొడవుగా ఉంటుందని జుట్టు కత్తరించటం అస్సలు నచ్చదని అనుపమ చెప్పారు.జుట్టు కత్తరించాలనే ఆలోచన వచ్చినా బాధ కలుగుతుందని ఆమె అన్నారు.షాపింగ్ కూడా తనకు నచ్చదని తెలిపారు.

#Premam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Anupama Parameshwaran Does Not Like Such Things At All Related Telugu News,Photos/Pics,Images..