ఆ అలవాటుకు నేను బానిసయ్యాను.. అనుపమ కామెంట్స్ వైరల్..?

అందం, అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్లలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ కు అదృష్టం లేకపోవడం వల్ల తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ రాలేదు.అనుపమ నటించిన గత సినిమా రాక్షసుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైనా ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండు సినిమాలు, రౌడీ బాయ్స్ మినహా అనుపమ ఖాతాలో సినిమాలు, లేవు.

 Actress Anupama Parameshwaran Comments About Game , Actress Anupama, Comments Ab-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో మాత్రం అనుపమ తన హవాను కొనసాగిస్తున్నారు.

ఒకప్పుడు అభినయ ప్రధాన పాత్రలే పోషించిన అనుపమ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశం వస్తే గ్లామర్ రోల్స్ లో నటించడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పేశారు.

రామ్ తో కలిసి అనుపమ రెండు సినిమాలు చేయగా బాక్సాఫీస్ వద్ద ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ప్రస్తుతం అనుపమకు నటిగా ఆఫర్లు తగ్గినా ఒక సక్సెస్ వస్తే ఆమె మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Telugu Actress Anupama, Game, English, Gibberish Game, Nikhil, Rowdy, Tollywood-

తాజా ఈ బ్యూటీ తాను ఒక ఆటకు బానిసయ్యానని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.ఇంగ్లీష్ పదాలను కనుక్కునే ఆటకు బానిసయ్యానని అనుపమ వెల్లడించారు.గిబ్బరిష్ అనే పేరుతో ఉన్న ఈ ఆటలో వెరైటీ పదాలను పలికి అసలు పదాలను కనిపెట్టాల్సి ఉంటుంది.నిన్న అనుపమ ఈ ఆట ఆడుతూ పాటలు పాడుతూ సోషల్ మీడియా లో సందడి చేయడం గమనార్హం.

Telugu Actress Anupama, Game, English, Gibberish Game, Nikhil, Rowdy, Tollywood-

నటి అనుపమ చేసిన అల్లరి నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది.నిఖిల్ కు జోడీగా నటిస్తున్న సినిమాలతో అనుపమ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.అఆ, ప్రేమమ్ సినిమాలతో టాలీవుడ్ కు పరిచయమైన అనుపమకు స్టార్ హీరోలు మాత్రం తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube