మొహం నల్లబడిందని నన్ను దూరం పెట్టారు.. అన్నపూర్ణ కీలక వ్యాఖ్యలు?

తెలుగులో సీనియర్ నటిగా అన్నపూర్ణ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోలలో పాల్గొని అన్నపూర్ణమ్మ తనదైన శైలిలో పంచ్ లు వేయడం ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.

 Actress Annapoorna  Interesting Comments About Movie Offers In Tollywood, Annapo-TeluguStop.com

తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్నపూర్ణ తన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

కరోనా వచ్చిన తరువాత తమకు అవకాశాలు వస్తున్నాయని అన్నపూర్ణ అన్నారు.

తన ముఖం నల్లబడటం వల్ల నాలుగేళ్లో ఐదేళ్లో పని చేయలేదని అన్నపూర్ణ తెలిపారు.యంగ్ మదర్స్ ఇండస్ట్రీలోకి రావడంతో కూడా ఆఫర్లు తగ్గాఅయని అన్నపూర్ణ అన్నారు.

సినిమాల్లో అవకాశాలు తగ్గాక బుల్లితెర ఆఫర్ల వైపు ఆసక్తి చూపానని అన్నపూర్ణ వెల్లడించారు.నేనెప్పుడూ ఎవరినీ అవకాశాలు అడగనని అన్నపూర్ణ తెలిపారు.

Telugu Annapoorna, Balak Color, Laks, Etv Serials, Offers, Punches, Serials, You

టీవీ సీరియల్స్ కు కూడా మంచి పేమెంట్ ఇచ్చారని సీరియళ్ల ద్వారా కూడా 18 లక్షలు సంపాదించానని ఆ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అయ్యానని అన్నపూర్ణ పేర్కొన్నారు.జీవితం అయితే బాగుందని బామ్మ పాత్రలకు తనను పిలుస్తారని అన్నపూర్ణ అన్నారు.ఏ పెద్ద హీరో ఉన్నా ఒకటి రెండు సీన్లు ఉంటే బాగుంటాయని కొన్నిసార్లు ఆ సీన్లు కూడా ఉండవని అన్నపూర్ణ వెల్లడించడం గమనార్హం.

Telugu Annapoorna, Balak Color, Laks, Etv Serials, Offers, Punches, Serials, You

తాను వివాదాలకు దూరంగా ఉంటానని నచ్చని మనుషులతో తాను మాట్లాడనని మన కోసం మనం బ్రతకాలని అన్నపూర్ణ తెలిపారు.ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న అన్నపూర్ణ కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది సీనియర్ నటీనటులకు అవకాశాలు తగ్గినా అన్నపూర్ణ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.

ఒకప్పుడు అమ్మ పాత్రల్లో ఎక్కువగా నటించిన అన్నపూర్ణ ఇప్పుడు బామ్మ పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube