మళ్లీ ప్రేమలో పడ్డ హీరోయిన్‌

హీరోయిన్‌ అంజలి తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలో మంచి సక్సెస్‌ ను దక్కించుకుంది.తమిళం నుండి తెలుగుకు వచ్చిన అంజలి ఇక్కడ కూడా సక్సెస్‌ అయ్యింది.

 Actress Anjali Once Again In Love, Anjali,breakup, Hero Jai, Dating, Love Life,-TeluguStop.com

అయితే ఈమె గురించి మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది.ఆమధ్య ఫ్యామిలీతో గొడవ అంటూ వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత హీరో జై తో ప్రేమ సహజీవనం అంటూ ప్రచారం జరిగింది.ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు.

అయితే ఇద్దరి మధ్య ప్రేమ అయితే పుట్టింది కాని అది కొద్ది కాలమే సాగింది.ఇద్దరి బ్రేకప్‌ కు కారణం తెలియదు కాని వారు బ్రేకప్‌ అయ్యారు అనేది మాత్రం పక్కా అంటూ తమిళ సినీ పత్రిక ఒకటి పేర్కొంది.

ఇప్పుడు అదే మీడియా సంస్థ మరో కథనంను తీసుకు వచ్చింది.అంజలి ప్రస్తుతం ప్రేమలో ఉంది.అది జై మాత్రం కాదు.అతడితో బ్రేకప్‌ అయిన తర్వాత ఆమె కొత్త జంట ఎంపిక చేసుకుంది.

ఇండస్ట్రీకి చెందిన అతడితో ప్రస్తుతం లవ్‌ ను ఎంజాయ్‌ చేస్తుంది.గతంలో మాదిరిగా ఈసారి కొత్త ప్రియుడితో అంజలి సహజీవనం సాగించడం లేదు.

ప్రేమ విషయాన్ని త్వరలోనే బహిరంగంగా ప్రకటించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అంటూ తమిళ మీడియా సంస్థ పేర్కొంది.అయితే ఈ విషయంలో నిజా నిజాలు ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.

Telugu Actressanjali, Anjali, Breakup, Jai, Love, Nishabdam, Nishabdham, Tamil-

హీరోయిన్స్‌ విషయంలో ప్రేమ పెళ్లి వార్తలు చాలా కామన్‌ గా వస్తూ ఉంటాయి.అందులో ఎక్కువ శాతం నిజాలు ఉండటం లేదు.కనుక అంజలి విషయం ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నఅంజలి ఓటీటీలో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉంది.

తెలుగులో ఈమె అనుష్కతో కలిసి నటించిన ‘నిశబ్దం’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ఆ సినిమాలో ఈమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube