పెళ్ళి కాకుండానే ఆ హీరోతో కలిసి ఉంటున్న అంజలి?  

Actress Anjali In “living Together” Relationship With Jai -

తెలుగింటి అమ్మాయి అంజలికి తెలుగులో కన్నా తమిళంలోనే సక్సెస్, పాపులారిటి, ఆఫర్స్ అన్ని ఎక్కువ.అందుకేనేమో, ప్రొఫెషనల్ గానే కాదు, పర్సనల్ గా కూడా అక్కడే సెటిల్ అయ్యేలా ఉంది.

మీకు తెలిసే ఉంటుంది, అంజలికి, తమిళనటుడు జైకి మధ్య ఏదో నడుస్తోందని ఎప్పటినుంచో తమిళ సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

Actress Anjali In Living Together Relationship With Jai--Telugu Tollywood Photo Image

వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని మరో మెట్టు పైకి ఎక్కించనున్నారని, త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని కూడా వార్తలొస్తున్నాయి.

ఈ వార్తలని వీరు ఒప్పుకోకపోయినా, ఎప్పుడూ తోసిపుచ్చలేదు కూడా.

తాజాగా వీరి సోషల్ పోస్ట్ ఒకటి చూస్తే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని అర్థం అవుతోంది.

జ్యోతిక నటించిన కొత్త సినిమా ప్రమోషన్ కోసం తమిళ సినీజనాలు దోశలు వేసే ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు.ఈ ఛాలెంజ్ లో జై కూడా పాల్గొన్నాడు.

కాని కట్ చేస్తే ఇంట్లో జై ఒక్కడే లేడు, అంజలి కూడా తనతోపాటే ఉంది.

ఇక జై పెట్టిన ఆ పోస్ట్ ని షేర్ చేసిన అంజలి, ” రుచికరమైన దోశ.ఇష్టమైన వారు మనకోసం వంటచేస్తే ఎంత బాగా అనిపిస్తుందో” అని ట్వీట్ చేసింది.సో, మీకు మ్యాటర్ అర్థం అయిపోయింది అనుకుంటా.

ఆల్ ది బెస్ట్ అంజలి.

తాజా వార్తలు

Actress Anjali In “living Together” Relationship With Jai- Related....