కంటతడి పెట్టిన ‘నువ్వు నేను’ అనిత.. బాబుని అలా చూడటంతో..?

తేజ డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన నువ్వు నేను సినిమాతో అనిత నటిగా పరిచయమయ్యారు.ఈ సినిమా సక్సెస్ సాధించడంతో నటిగా ఆమె మంచి పేరును సొంతం చేసుకున్నారు.

 Actress Anitha Hassanandani Shares Her Son Aaraav Video, Aaraav , Actress , Anit-TeluguStop.com

దాదాపు నాలుగు నెలల క్రితం అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.బాబు ఆలనాపాలనా చూసుకోవాలనే ఆలోచనతో అనిత తాత్కాలికంగా నటనకు దూరమయ్యారు.

తాజాగా అనిత అమ్మతనం మాధుర్యాన్ని అనుభవిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

తాజాగా అనిత ఒక ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు.

బాబు ప్రశాంతంగా పడుకొని ఉండగా బాబును ప్రేమగా చూస్తూ భావోద్వేగానికి గురై అనిత ఎమోషనల్ అయ్యారు. హార్ట్ టచింగ్ గా, ఎమోషనల్ గా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

అనిత 2013 సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు.వివాహం జరిగిన 7 సంవత్సరాల తర్వాత అనిత తొలి సంతానానికి జన్మనిచ్చారు.

Telugu Aaraav, Actress Anitha, Serials, Tollywood-Movie

2013లో వివాహం జరిగిన తర్వాత అనిత సినిమాల సంఖ్యను తగ్గించారు.బాలీవుడ్ లో నాగిని అనే సీరియల్ చేసిన అనిత ఆ సీరియల్ ద్వారా నెటిజన్లను ఆకట్టుకున్నారు.అనిత తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలలో, సీరియళ్లలో కూడా నటించడం గమనార్హం.ముంబైకు చెందిన అనిత సినీ కెరీర్ లో పెద్దగా విజయాలు లేకపోవడంతో తర్వాత రోజుల్లో ఆమెకు అవకాశాలు తగ్గాయి.

Telugu Aaraav, Actress Anitha, Serials, Tollywood-Movie

పలు టీవీ యాడ్లకు అనిత ప్రచారం చేశారు.అనిత తన బాబుకు అరవ్ అని పేరు పెట్టుకున్నారు.సినిమాలకు, సీరియళ్లకు తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ అనిత కొన్ని కమర్షియల్ యాడ్స్ కు మాత్రం పని చేస్తున్నానని వెల్లడించడం గమనార్హం.అనిత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube