ప్రముఖ హాలీవుడ్ నటి జెస్సికా చస్టెయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు.కానీ హాలీవుడ్ సినిమాలను తరచుగా చూస్తూ ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈమె ముక్కుసూటి మనిషి.తన మనసులో ఏది ఉన్నా కూడా ఆ నిర్మొహమాటంగా బయట పెట్టేస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే గతంలో ఒకసారి ఇండస్ట్రీలలో మహిళలను చూసే విధానం గురించి బహిరంగంగానే మాట్లాడిన విషయం తెలిసిందే.ఇండస్ట్రీలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, కానీ మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోరు అన్నింటిలోనూ సమానం అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె నటీమణులు అంటే కేవలం పని చేయడానికి మాత్రమే కాదు.పని ఇవ్వడానికి కూడా అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.హాలీవుడ్ లో డైరెక్టర్ సైమన్ కిన్ బెర్గ్ దర్శకత్వం వహించిన సినిమా స్పై థ్రిల్లర్ ది 355.
ఈ సినిమా జనవరి 21న భారత్ లో విడుదల అయ్యింది.ఈ సినిమాలో ఒక కథనం ద్వారా మూస పద్ధతులను ధిక్కరిస్తూ, లింగవివక్షని వేలెత్తి చూపిస్తూ ఉంటుంది.
ఇక ఈ సినిమాలో నటి జెస్సికా చస్టెయిన్ సిఐఎ ఏజెంట్ మేస్ గా నటించింది.అంతేకాకుండా ఓ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించింది.

తాజాగా ఈమె ఇలాంటి థ్రిల్లర్ సినిమాలో హాలీవుడ్ లోని ఉత్తమ నటీనటులు కలిసి పనిచేయడం గురించి మాట్లాడింది.ఈ సందర్భంగా నటి జెస్సికా చస్టెయిన్ మాట్లాడుతూ.ఈ ఇండస్ట్రీలో మహిళలను చూసే విధానం గురించి గతంలో బహిరంగంగా మాట్లాడాను.నటీమణులు అంటే పని చేయడానికి మాత్రమే కాదు.యజమానులుగా పని ఇవ్వడానికి కూడా అని చూపించడానికి ఒక సినిమా తీయడం మాకు చాలా ముఖ్యం.ఒకరికి ఒకరు వెన్నుదన్నుగా ఉండటం ఎంతో మంచి అనుభూతి కలిగిస్తుంది.
దానికి ఎంతో సంతోషం ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది.